Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalSaturday | శనివారం ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే వస్తుంది

Saturday | శనివారం ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే వస్తుంది

Saturday | శనివారం అంటే శనికి అంకితమైన రోజు. కాబట్టి ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పనుల్లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అలా కాకుండా ఆయనకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే లేని పోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి శని దేవుడి ఆగ్రహానికి గురికావద్దంటే ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని ఇంటికి తీసుకురాకండి

శనివారం నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు. ఇవాళ నువ్వుల నూనెను ఇంటికి తీసుకొస్తే అప్పుల పాలవుతారని పండితులు చెబుతున్నారు. నువ్వులు, ఉప్పు కొని ఇంటికి తీసుకురావడం కూడా ఆర్థికంగా కుంగుబాటుకు దారితీస్తుంది. పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయొద్దు. గుమ్మడికాయను కొనడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఒకవేళ వీటిలో ఏదైనా తప్పనిసరి అవసరమైన వస్తువు అయితే ముందు రోజే కొని ఇంట్లో ఉంచుకోవాలి. శనిదేవుడు ఇనుమును ఆయుధంగా ధరించినవాడు. కాబట్టి శనివారం ఇంట్లోకి ఇనుముతో చేసిన వస్తువులను తీసుకొస్తే దరిద్రం చుట్టుకుంటుందని చెబుతుంటారు. శనికి ఇష్టమైన నల్లటి వస్త్రం, మినుములు కూడా ఇంట్లోకి తీసుకురావద్దు. ఈరోజున చెప్పులు, షూ కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఇంటి పురోగతి దెబ్బతింటుంది.

ఈ పని చేయవద్దు

శనిదేవుడిని న్యాయానికి ప్రతీకగా కొలుస్తారు. కాబట్టి ఈ రోజు పెద్దవారిని అగౌరవిస్తే శని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అందుకే శనివారం తల్లిదండ్రులు, వృద్ధులను అవమానించవద్దు. అదే తల్లిదండ్రులకు సేవ చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. శని ప్రభావం దూరమవుతుంది. ఈ రోజున జంతువులను కూడా హింసించకూడదు.

వీటిని అస్సలు దానం చేయవద్దు

శని, బృహస్పతి ఇద్దరినీ శత్రువులుగా పేర్కొంటారు. కాబట్టి బృహస్పతికి ఇష్టమైన పసుపును ఈ రోజు దానం చేస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అలాగే శనివారం తెల్లటి వస్త్రాలు దానం చేయకూడదు. తెలుపు వర్ణంలో ఉండే బియ్యం, పంచదార, వెండి వంటి వస్తువులను కూడా దానం చేయవద్దు. తెలుపుతో పాటు ఎరుపు వర్ణంలో ఉండే ధాన్యాలను దానం చేయడం కూడా మంచిది కాదు. శనివారం పొరపాటున కూడా పసుపు దానం చేయకూడదు. శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు నలుపు వర్ణంలో ఉండే మినప్పప్పుతో వండిన కిచిడీని దానం చేయడం మంచిది. దీనివల్ల మంచి జరుగుతుంది. శని దోషం తొలగాలంటే శనివారాల్లో రావిచెట్టు కింద దీపం వెలిగించి నాణెం సమర్పించాలి. ఈ దీపాలను సూర్యాస్తమయం తర్వాతనే వెలిగించాలి. సూర్యాస్తమయానికి ముందు శనిదేవుడిని పూజించకూడదు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News