Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalWednesday | బుధవారం ఎంత అవసరమైనా ఈ 5 పనులు అస్సలు చేయొద్దు

Wednesday | బుధవారం ఎంత అవసరమైనా ఈ 5 పనులు అస్సలు చేయొద్దు

Wednesday | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేధస్సు, వివేకానికి ప్రతీకగా బుధ గ్రహాన్ని కొలుస్తారు. అలాంటి బుధుడు అధిపతిగా ఉన్న బుధవారం రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. దీనివల్ల బుధుడి అనుగ్రహం లభించకపోగా.. లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. అందుకే బుధవారం ఈ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

అప్పు ఇవ్వకూడదు

బుధవారం ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. ఈ రోజున ఎవరికైనా డబ్బులు ఇస్తే లాభించదు. కానీ ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం మాత్రం లాభదాయకమని పెద్దలు చెబుతుంటారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడులకు శుక్రవారం అనుకూలమైన సమయం అని జ్యోతిష్యులు చెబుతుంటారు.

ఎవరినీ అవమానించవద్దు

బుధవారం రోజు ఎవరినీ బూతులతో దూషించవద్దు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లతో అమర్యాదగా ప్రవర్తించకూడదు. స్త్రీలను అవమానించవద్దు. దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ రోజున అందరితో ప్రేమగా మాట్లాడాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం నెలకొంటాయని పెద్దలు విశ్వసిస్తారు.

వీటిని తినకూడదు

పచ్చి వెన్న, పప్పు, కొత్తిమీర, పాలకూర, ఆవాలు, బొప్పాయి, జామ వంటివి కొనుగోలు చేయడం అశుభం. తమలపాకు, పాన్‌ నమలడం కూడా మంచిది కాదు. ఇది ఆర్థికంగా పరిస్థితిని దిగజార్చుతుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు బుధుడికి వ్యతిరేకం. కాబట్టి ఆ రంగు వస్తువులను కొనుగోలు చేయడం వల్ల బుధుడి ప్రతికూలత మనపై పడుతుంది. ఈ రోజున పాలతో తయారు చేసే ఖీర్ రబ్రీ వంటి వంటకాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

ఈ వస్తువులు కొనుగోలు చేయొద్దు

బుధవారం కొత్త బట్టలు, షూ కొనుగోలు చేయకూడదు. వాటిని ధరించవద్దు. ఒకవేళ ధరిస్తే మీకు హాని కలుగుతుంది. టూత్‌ బ్రష్‌ అలాగే జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు. పెళ్లయిన ఆడవాళ్లు నలుపు రంగు బట్టలు, ఆభరణాలు ధరించడం మంచిది కాదు.

పెళ్లయిన మగాళ్లు బుధవారం రోజు అత్తమామల ఇంటికి వెళ్లడం శ్రేయస్కరం కాదు. అలాగే సోదరీమణులను, కుమార్తెలను ఇంటికి ఆహ్వానించడం కూడా మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News