Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalMaha Shivaratri | శివుడిని బిల్వ పత్రాలతోనే ఎందుకు పూజిస్తారు? మొదట ఈ పూజ చేసింది...

Maha Shivaratri | శివుడిని బిల్వ పత్రాలతోనే ఎందుకు పూజిస్తారు? మొదట ఈ పూజ చేసింది ఎవరు?

Maha Shivaratri | శివారాధనలో అతి ముఖ్యమైనది బిల్వ పత్రి. పరమేశ్వరుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను తీరుస్తాడు. అందుకే బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. మరి శివుడికి ఈ బిల్వ పత్రి అంటేనే ఎందుకు అంత ఇష్టం? మహాశివరాత్రి నాడు మారేడు దళాలతోనే ఎందుకు ఆరాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

పరమేశ్వరుడిని పెళ్లాడాలని పర్వతరాజు కుమార్తె అయిన పార్వతి అనుకుంటుంది. అప్పటికే సతీ వియోగంతో బాధలో ఉన్న శివుడు ధ్యానం చూస్తూ ఉండిపోతాడు. ధ్యానంలో నిమగ్నమైన శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పార్వతీదేవి తపస్సు చేస్తుంది. బిల్వ వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉన్న పరమేశ్వరుడిని పూజించేందుకు పూజా సామాగ్రి తీసుకురావడం మరిచిపోతుంది. ఏం చేయాలో తోచక అక్కడే ఉన్న బిల్వ పత్రాలను పుష్పాలుగా భావించి ముక్కంటికి సమర్పిస్తుంది. పూజ పూర్తయ్యేలోపు బిల్వ పత్రాలతో శివుడిని మొత్తం కప్పేస్తుంది. ఆ పూజ శివుడికి ఎంతగానో నచ్చి పార్వతిని అనుగ్రహిస్తాడు. అప్పట్నుంచి శంకరుడిని బిల్వ పత్రాలతో పూజించడం మొదలైంది.

ఈ నిబంధనలు తప్పనిసరి

మహాశివరాత్రి నాడు బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతులు ఈ పూజ చేస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే బిల్వ పత్రాలను తెంపేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సోమ, మంగళ, శుక్ర వారాల్లో బిల్వ పత్రాన్ని కోయకూడదు. సంక్రమణ, అసౌచం, రాత్రి సమయాల్లో మారేడు దళాలను కోయవద్దు. అలాగే పూజకు వినియోగించే పత్రిలో కచ్చితంగా మూడు ఆకులు ఉండేలా చూసుకోవాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News