Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalDevotional News | దేవుడికి పిలక లేని కొబ్బరికాయ కొడితే దోషమా?

Devotional News | దేవుడికి పిలక లేని కొబ్బరికాయ కొడితే దోషమా?

Devotional News | పూజ చేసిన తర్వాత కొబ్బరి కాయ కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. టెంకాయ కొట్టడం అంటే భగవంతునికి ఆత్మనివేదన చేసుకోవడమే. అంటే కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి.. దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి టెంకాయను జుట్టు తీసి కొట్టడం దోషంగానే చెబుతారు. ఎందుకంటే..

టెంకాయను మనిషి శిరస్సుతో పోలుస్తారు. కాయపై ఉండే పొరను చర్మంగా, పీచును మాంసంగా భావిస్తారు. దృఢంగా ఉండే చిప్పను ఎముకలుగా.. లోపల ఉండే కొబ్బరిని మనిషిలోని ధాతువుగా.. నీళ్లను ప్రాణాధారంగా పోలుస్తారు. ఇక జుట్టును మనలో ఉండే జ్ణానానికి, అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే టెంకాయను భగవంతుడి ముందు కొడుతూ మనలో ఉండే అహంకారం తొలగిపోవాలని కోరుకుంటాం. టెంకాయ కొట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. అందుకే పిలక లేని కొబ్బరికాయను కొట్టడం దోషమే అవుతుంది.

అసలు టెంకాయను మనిషి తలతో పోల్చడానికి గణేశ పురాణంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. త్రిపురాసురులు అనే రాక్షసులను సంహరించేందుకు మహాశివుడు వెయ్యేళ్ల పాటు కఠోర తపస్సు ఆచరించాడు. ఆ తపో బలంతో అఘోరాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాడు. కానీ దానితో యుద్ధంలో త్రిపురాసురులను వధించడం సాధ్యం కాలేదు. దానికి కారణమేంటని మదనపడుతుండగా శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై.. యుద్దానికి ముందు గణపతికి పూజ చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెబుతాడు. ఏ కార్యమైన నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే గణపతి పూజ చేయాలని గుర్తుచేస్తాడు. దీంతో తరువాత రోజు యుద్ధరంగంలోనే గణపతి పూజ చేసేందుకు శివుడు సర్వం సిద్ధం చేసుకుంటాడు. ఆ హడావుడిలో గణపతికి నైవేద్యం చేయడం మరిచిపోతాడు.దీంతో గణేశుడు అలక పూనుతాడు.

పూజ అయిపోయిన తర్వాత మహాశివుడు ఈ విషయాన్ని గుర్తిస్తాడు. వెంటనే రకరకాల ఫలాలు, ఆహార పదార్థాలను గణపతి ముందు ఉంచుతాడు. కానీ అవేవీ గణేశుడు స్వీకరించడు. వెంటనే పార్వతీ దేవి యుద్ధరంగానికి వచ్చి శాకాంబరి దేవిగా మారి.. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు సమర్పిస్తుంది. వాటిని కూడా గణపతి స్వీకరించడు. అప్పుడు పార్వతి దేవి ఏం కావాలని అడుగుతుంది. దానికి తన తలపండును సమర్పించమని శివుడిని అడుగుతాడు. అప్పుడు గణపతి కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News