Home Lifestyle Health Age and Fertility | తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో పిల్లలను కనాలి...

Age and Fertility | తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో పిల్లలను కనాలి ? గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Age and Fertility | వయసు 30 దాటినా పెళ్లి చేసుకోని వాళ్లు చాలా మందే ఉన్నారు. పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. అప్పుడేనా ? అన్నట్లు కొంత మంది చూస్తుంటారు. ఉద్యోగం, సెటిల్‌మెంట్‌ అంటూ కొంతమంది పెళ్లిళ్లలను వాయిదా వేస్తూ పోతుంటారు. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాల్సిందే. లేదంటే పుట్టబోయే పిల్లలకు, తల్లికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు, ఉద్యోగాలతో పాటు గర్భదారణ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిఒక్కరి ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. టైంకి ఫుడ్డు ఉండటం లేదు. సరైన నిద్ర కూడా కరువైంది. డబ్బుల వెనుక పరిగెడుతూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. పెళ్లైనా పిల్లలను ప్లాన్‌ చేసుకునే విషయంలో సరైన అవగాహన ఉండటం లేదు. అందుకే ముందుగా ఏ వయసులో పిల్లల్ని కనాలి? లేటు వయసులో పిల్లల్ని ప్లాన్‌ చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో కచ్చితంగా అవగాహన పెంచుకోవాల్సిందే.

పాతికేళ్ల వయసులో..

25 ఏళ్ల వయసులో గర్భం దాల్చితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. వయసు పెరుగుతున్నా కొద్ది అండాశయ పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా అండాలు సరిగా విడుదల కావు. ఒకవేళ విడుదలైనా ఫలదీకరణ విషయంలో సరిగా స్పందించవు. దీంతో వయసు పెరిగే కొద్ది పేరెంట్స్‌ నుంచి బిడ్డకు అందే క్రోమోజోముల్లో సమస్యలు తలెత్తే ఛాన్స్‌ ఉంటుంది. హార్మోన్ల పనితీరు విషయంలో తేడాలు వస్తాయి.

35 ఏండ్ల వయసులో..

సాధారణంగా 35 ఏళ్లు వయసు దాటిందంటే.. హైబీపీ, షుగర్‌ లాంటి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. గర్భం దాల్చినా వీటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నెలలు నిండాక ఇబ్బందులు వస్తాయి. నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కొన్నిసార్లు గర్భసంచిలో గడ్డలు ఏర్పడి.. సిజేరియన్‌ కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాన్పు సమయంలో తీవ్ర రక్తస్త్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

40 ఏండ్ల వయసులో..

సాధారణంగా పెళ్లైన తర్వాత కొంత మంది ఉద్యోగం, బాధ్యతలు, డబ్బులు సంపాదించిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఆ ఆలోచన తప్పని అంటున్నారు వైద్యులు. నలభై ఏళ్ల వయసులో గర్భం దాలిస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. శిశువు ఎదుగుదల సరిగా ఉండకపోవడంతో పాటు శారీరక, మానసిక సమస్యలతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భస్త శిశువులో ఎదుగుదల లేక అబార్షన్లు అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంటుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. వయసు పెరిగినా కొద్దీ.. జన్యు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చినతర్వాత వైద్యుల సలహా మేరకు ముందు నుంచి ఫోలిస్ యాసిడ్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

రోజూవారీ ఆహారంలో ఇవి ఉండాల్సిందే..

ముఖ్యంగా వయసు పెరుగుతున్నా కొద్ది కొంతమందిలో రక్తహీనత సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వాళ్లు ముందే పరీక్షలు చేపించుకొని.. సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్‌ ఎక్కువగా అందే ఆకుకూరలు, బీట్‌రూట్‌ జూస్‌, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు, పల్లీ పట్టీలు, క్యారెట్‌, నాన్‌వెజ్‌లాంటివి రోజూవారి ఆహారంలో భాగం చేసుకోవాలి.

Exit mobile version