Home Entertainment Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి...

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | కాస్ట్యూమర్‌గా సినీ ఇండస్ట్రీగా వచ్చిన కాస్ట్యూమ్స్‌ కృష్ణ.. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా మారాడు. అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటాడు. మొదట కాస్ట్యూమర్‌గా ఇండస్ట్రీకి వచ్చి అగ్ర నటీనటులు అందరికీ ఫేవరేట్‌ కాస్ట్యూమర్‌ డిజైనర్‌గా మారాడు. ఆ తర్వాత డైరెక్టర్‌ కోడి రామకృష్ణ సలహాతో నటుడిగా మారి విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నిర్మాతగానూ ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలను నిర్మించాడు. ఇలా అన్ని విభాగాల్లో తన సత్తా చాటినప్పటికీ ఒక స్టార్‌ హీరో మీద నమ్మకంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరకు ఇండస్ట్రీనే వదిలివెళ్లాల్సిన పరిస్థితికి వచ్చాడు.

కాస్ట్యూమర్‌గా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నిర్మాత కావాలని కాస్ట్యూమ్స్‌ కృష్ణ కలలు కన్నాడు. పైసాపైసా కూడబెట్టి సూపర్‌ స్టార్‌ కృష్ణతో అశ్వత్ధామ సినిమా తీసి తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించాడు. పెళ్లాం చెబితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి వంటే పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు. చివరగా జగపతి బాబుతో పెళ్లి పందిరి సినిమా తీశాడు. ఈ సినిమాతోనే కాస్ట్యూమ్స్‌ కృష్ణకు పెద్ద దెబ్బ పడింది.

జగపతి బాబు, పృథ్వీ, రాశి ప్రధాన పాత్రల్లో పెళ్లిపందిరి సినిమాను కాస్ట్యూమ్స్‌ కృష్ణ తెరకెక్కించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అప్పట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా అవుట్‌పుట్ కూడా బాగా రావడంతో ఈ సినిమాకు ప్రమోషన్‌ అక్కర్లేదని, మౌత్‌ పబ్లిసిటీతోనే హిట్‌ అవుతుందని కాస్ట్యూమ్స్‌ కృష్ణ భావించాడు. కానీ ఈ సినిమా కొన్న బయ్యర్లు మాత్రం భయపడ్డారు. ప్రమోషన్‌ లేకపోతే సినిమా గురించి జనాలకు ఎలా తెలుస్తుందని అనుకున్నారు. ఇదే విషయం కాస్ట్యూమ్స్‌ కృష్ణకు చెప్పారు.. కానీ సినిమా మీద నమ్మకంతో వాళ్ల మాటలను పట్టించుకోలేదు.

కాస్ట్యూమ్స్‌ కృష్ణ చెబితే వినట్లేదని.. బయ్యర్లు డైరెక్ట్‌గా జగపతి బాబు వద్దకు వెళ్లి విషయం చెప్పారు. దీంతో కాస్ట్యూమ్స్‌ కృష్ణ ఖర్చులకు భయపడుతుందని జగపతిబాబు అనుకుని.. తన రెమ్యునరేషన్‌లో 5 లక్షలు తగ్గించాడు. అందులో 2 లక్షలు పెట్టి పబ్లిసిటీ కోసం ఖర్చుపెట్టాలని సలహా ఇచ్చాడు. అప్పుడే మీ దగ్గర డబ్బు లేకపోతే ఆ రెండు లక్షలు మేం అప్పుగా ఇస్తామని బయ్యర్లు ముందుకొచ్చారు. దీనికోసం అగ్రిమెంట్‌ మీద సంతకం పెట్టాలని చెప్పారు. జగపతి బాబు మీద నమ్మకంతో బయ్యర్లు తెచ్చిన పేపర్ల మీద సంతకాలు పెట్టి.. వాళ్లిచ్చిన రెండు లక్షలతో సినిమాకు పబ్లిసిటీ చేశారు. సినిమా రిలీజయ్యాక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే కాస్ట్యూమ్స్‌ కృష్ణ పెద్దగా చదువుకోలేదు. ఆయనకు తెలుగు, తమిళం తప్ప వేరే భాషలు రావు. ఇదే అదునుగా బయ్యర్లు ఆయన్ను మోసం చేశారు. రెండు లక్షలు అప్పుగా ఇచ్చే సమయంలో రెండు పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. అందులో ఒకటి రెండు లక్షలు అప్పుగా ఇచ్చినట్లు ఉండగా.. మరో కాగితంలో పెళ్లి పందిరి సినిమా నెగెటివ్‌ రైట్స్‌ను బయ్యర్లు కొన్నట్లుగా ఉంది. ఆ అగ్రిమెంట్‌ అర్థంకాకపోయినా వాళ్లందరినీ నమ్మి కాస్ట్యూమ్స్‌ కృష్ణ మోసపోయాడు. దీంతో సినిమా బ్లాక్‌బస్టర్‌ అయినప్పటికీ.. నెగెటివ్‌ రైట్స్‌ బయ్యర్లకు వెళ్లిపోవడంతో నష్టపోయాడు. ఈ దెబ్బతో సినిమాల మీద విరక్తి చెంది ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాడు.

Exit mobile version