Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentKaikala Satyanaraya | మహాప్రస్థానంలో ముగిసిన కైకాల అంత్యక్రియలు

Kaikala Satyanaraya | మహాప్రస్థానంలో ముగిసిన కైకాల అంత్యక్రియలు

Kaikala Satyanaraya | ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫిలింనగర్‌లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కైకాల పార్థివదేహానికి అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం మహాప్రస్థానంలో కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కైకాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.

1935 జూలై 25న కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో జన్మించాడు. కాలేజీ రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న కైకాల పలు నాటకాల్లో నటించాడు. 1959లో సిపాయి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఆశించినస్థాయిలో సక్సెస్ అందకపోవడంతో.. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సూచన మేరకు విలన్‌గా మారాడు. పౌరాణికం, జానపద చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో మెప్పించాడు. తన 60 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా యమగోల చిత్రంలో యముడిగా కైకాల నటన చిరస్థాయిలో గుర్తుండిపోతుంది.చివరగా 2019లో మహర్షి సినిమాలో నటించాడు కైకాల.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News