Thursday, September 28, 2023
- Advertisment -
HomeEntertainmentSunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Sunil | బ్రహ్మానందం బీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పుడు తన కామెడీ టైమింగ్ తో బ్రహ్మీనే డామినేట్ చేశాడు సునీల్. ఇప్పుడంటే ఆయన క్రేజ్ తగ్గింది కానీ, అప్పట్లో సునీల్ డిమాండ్ మాములుగా ఉండేది కాదు. స్టార్ హీరో సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా సునీల్ ఉండాల్సిందే. అంతేనా.. సునీల్ కోసమే రచయితలు సెపరేట్ గా సీన్స్ రాసేవారు. అలాంటి స్టార్ స్టేటస్ అనుభవించిన సునీల్ హీరోగా మారి చేతులు కాల్చుకున్నాడు. అందాల రాముడు సినిమాతో హీరో అవతారమెత్తిన సునీల్‌కు మొదటి సినిమానే సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక అదే ఊపులో ఏకంగా రాజమౌళితో మర్యాద రామన్న చేసి ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. దాంతో క్యారెక్టర్ వేషాలకు స్వస్తి చెప్పి పూర్తి హీరోగా మారిపోయాడు. ఇక మూడో సినిమాకే సిక్స్ ప్యాక్‌ను దట్టించి పూల రంగడు సినిమాతో మరో హిట్టు కొట్టేశాడు. హీరోగా హ్యట్రిక్ విజయాలు సాధించడంతో దర్శక, నిర్మాతలు సునీల్ ఇంటి ముందు వాలిపోయారు.

కమెడియన్‌గా అందరి మతుల్లో పాతుకుపోయిన సునీల్‌ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఒకానొక దశలో సునీల్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసింది అనే మాటలు కూడా తన చెవిన పడ్డాయి. ఎంచక్కా తన రూట్ లోనే కామెడీ సినిమాలు చేసుకుంటూ పోతే కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయల్లా ఉండేది అంటూ పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సునీల్ మళ్లీ దాదాపు ఏడేళ్ల తర్వాత గ్యాప్ తీసుకుని తన రూట్ లోకి వచ్చేశాడు. సునీల్ మిత్రుడు త్రివిక్రమ్ అరవింద సమేతలో ఒక మంచి పాత్ర ఇచ్చాడు. ఇక ఈ సినిమా హిట్టవడంతో సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ బిజీ అయిపోయాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునీల్ ను పుష్పలోని మంగళం శ్రీను పాత్ర ఎక్కడికో తీసుకెళ్లింది.

పుష్ప జాతీయ స్థాయిలో హిట్టు కావడంతో సునీల్‌కు కూడా మంచి పేరొచ్చింది. పేరుతో పాటుగా బోలెడన్నీ ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ఇన్నాళ్లు తెలుగు సినిమాలే చేసిన సునీల్ కు పుష్ప పుణ్యమా అని కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అవి కూడా చిన్నా చితకా కాదు. రజనీ కాంత్, కార్తి, శివ కార్తికేయన్, విశాల్ వంటి అగ్ర నటుల సినిమాల్లో. రజనీకాంత్ జైలర్ సినిమలో సునీల్ పాత్ర చాలా కీలకమైనదని కోలీవుడ్ వర్గాల టాక్. ఇక కార్తి జపాన్ లోనూ సునీల్ కు గొప్ప పాత్రే దక్కిందని సమాచారం. శివ కార్తికేయన్ మావీరన్ లోనూ సునీల్ పాత్ర ముఖ్యమైనదేనట. ఇక విశాల్ మార్క్ ఆంటోనిలో ఇంటెన్సివ్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు వినికిడి. ఈ ఏడాది సునీల్ ఇప్పటి వరకు ఐదు సినిమాలకు సైన్ చేస్తే.. అందులో నాలుగు తమిళ సినిమాలే ఉండటం విశేషం. ఇక ఇదే జోరు కొనసాగితే తమిళంలోనూ సునీల్ జెండా పాతేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా మన కమెడియన్ పక్క భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తుండటం ఆనంద పడాల్సిన విషయమే. ఇక పుష్ప2లోనూ సునీల్ పాత్రను పెంచాడట సుకుమార్

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News