Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentPavitra Naresh | పవిత్ర లోకేశ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి గుడ్‌ న్యూస్‌ చెప్పిన నరేశ్‌

Pavitra Naresh | పవిత్ర లోకేశ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి గుడ్‌ న్యూస్‌ చెప్పిన నరేశ్‌

Pavitra Naresh | ఎట్టకేలకు నరేశ్‌ – పవిత్ర ఒక్కటవుతున్నారు. కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన ఈ కపుల్‌.. మూడుముళ్ల బంధంతో తమపై వస్తున్న కామెంట్స్‌ చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తన స్నేహితురాలు పవిత్ర లోకేశ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సీనియర్‌ నటుడు నరేశ్‌ ప్రకటించాడు. ఈ మేరకు పవిత్ర లోకేశ్‌కు లిప్‌ కిస్‌ ఇస్తూ ఒక వీడియోను షేర్‌ చేశాడు. కొత్త సంవత్సరం.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి. పవిత్ర, నేను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ట్విట్టర్‌లో నరేశ్‌ పేర్కొన్నాడు. దీనికి #pavitranaresh హ్యాష్‌ట్యాగ్‌ కూడా జత చేశాడు.

తన మూడో భార్య రమ్య రఘుపతికి కొంతకాలంగా దూరంగా ఉంటున్న నరేశ్‌.. తన సహచర నటి పవిత్రకు దగ్గరయ్యాడు. అప్పట్నుంచి తను నటించే సినిమాల్లో పవిత్రకు ఛాన్స్‌లు కూడా ఇప్పించేవాడు. ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా బయట తిరిగేవాళ్లు. అలా రహస్యంగా కలుసుకున్న సమయంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. వీరిద్దరినీ ఆ మధ్య ఓ హోటల్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా రమ్య రఘుపతి పట్టుకుంది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక వీళ్ల విషయం తెలియడంతో ఇద్దరూ ఓపెన్‌ అయిపోయారు.

మొన్న సూపర్ స్టార్‌ కృష్ణ చనిపోతే అక్కడ కూడా ఈ జంటనే హైలెట్‌ అయ్యింది. వీళ్ల ఓవర్‌ యాక్షన్‌ ఎక్కువయ్యిందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా వచ్చాయి. ఇలా టాలీవుడ్‌లో మోస్ట్‌ కాంట్రవర్సీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నరేశ్‌, పవిత్ర ఇప్పుడు పెళ్లిబంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా నరేశ్‌ తెలిపాడు. పవిత్రకు లిప్‌ కిస్‌ ఇవ్వడంతో పాటు ఒకరికొకరు కేక్‌ తినిపించుకుంటున్నట్టుగా ఉన్న వీడియోను పోస్టు చేశాడు. అయితే నరేశ్‌కు తన మూడో భార్య రమ్యతో విడాకులు ఇంకా పూర్తి కాలేదు. డైవర్స్‌ వ్యవహారం పూర్తి కాగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News