Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentvarisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్...

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

varisu vs thunivu | తమిళనాట అజిత్ (Ajith Kumar ), విజయ్ ( Vijay ) ఇద్దరికీ మంచి క్రేజ్ ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని నంబర్‌వన్ అని పిలిచినా పెద్ద యుద్ధమే జరుగుతుంది. మా హీరో ఎందులో తక్కువ అంటూ నానా రచ్చ చేస్తారు. వీళ్ల సినిమాలు సపరేట్‌గా రిలీజైతేనే ఫ్యాన్స్ హంగామా తట్టుకోలేం. అలాంటిది ఇద్దరి సినిమాలు పొంగల్‌కు పోటీ పడితే ఎలా ఉంటుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఫీట్ జరిగింది. అజిత్ తునివు, విజయ్ వారిసు సినిమాలతో బాక్సాఫీసు దగ్గర పోటీపడుతున్నారు. ఇవాళ ( జనవరి 11న ) రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో విజయ్, అజిత్ ఫ్యాన్స్‌ను ఆపడం ఎవరి తరం కావట్లేదు. తమ హీరోనే గొప్ప అని చూపించుకోవాలంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. అంతటితో ఆగకుండా తమ హీరోనే బెస్ట్.. వేరే హీరో వేస్ట్ అని ఫీలవుతూ తమిళ తంబీలు రెచ్చిపోతున్నారు. థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లను చింపేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు.

నిజానికి ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేసినప్పటి నుంచే అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. మొన్న ఆ మధ్య ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు విజయ్ పెద్ద హీరో అని అన్నాడు. తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు కావాలని కోరాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దిల్ రాజును ఆడుకున్నారు. విజయ్‌ను, దిల్ రాజును ట్రోల్ చేశారు. సినిమాల విడుదలకు ముందే అలా ఉంటే.. రిలీజయ్యాక ఎలా ఉంటుందో ఇక చూడండి. చెన్నై సహా ఇతర నగరాల్లో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది. ఈ క్రమంలో చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ వద్ద స్క్రీన్ల షేరింగ్ విషయంలో తలెత్తిన విబేధాల కారణంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ తన్నుకున్నారు.

చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్స్ ఉన్నాయి. వీటిలో ఒక స్క్రీన్ అజిత్ తునివుకు కేటాయించారు. రెండో స్క్రీన్‌ను విజయ్ వారిసుకు ఇచ్చారు. మూడో స్క్రీన్‌ను తమ హీరోకే ఇవ్వాలి అంటే మా హీరోకే ఇవ్వాలంటూ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. దీంతో దాన్ని ఎలా డిసైడ్ చేయాలో తెలియక థియేటర్ యాజమాన్యం చాలాసేపు మల్లగుల్లాలు పడింది. చివరకు టాస్ వేసి స్క్రీన్ సెలెక్ట్ చేసింది. మూడో స్క్రీన్‌ను అజిత్ తునివు సినిమాకు కేటాయించింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. తునివు సినిమా పోస్టర్లు, ఫ్లెక్సీలు చించేశారు. ఇది చూసి అజిత్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. ఇద్దరి ఫ్యాన్స్ పెద్ద గొడవపడ్డారు. థియేటర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

అజిత్ ఫ్యాన్ మృతి

చెన్నైలోని రోహిణి థియేటర్ వద్ద జరిగిన ప్రమాదంలో అజిత్ ఫ్యాన్ ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. తమ అభిమాన హీరో రిలీజ్ అవుతుండటంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు రోడ్డు మీద వెళ్తున్న లారీ ఎక్కి డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి లారీపై నుంచి కిందపడిపోయాడు. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News