Home Entertainment The OG | పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ మొదలెట్టేశాడు.. గ్రాండ్‌గా ఓజీ పూజా కార్యక్రమాలు

The OG | పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ మొదలెట్టేశాడు.. గ్రాండ్‌గా ఓజీ పూజా కార్యక్రమాలు

The OG | ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపు సినిమాలతో కూడా బిజీగా గడిపేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో ది ఓజీ సినిమా కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త అవతారంలో చూపిస్తానని సుజీత్ ప్రకటించినప్పటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. పైగా సాంగ్స్, ఫైట్స్ లేకుండా ది ఓజీ వస్తుందని చెప్పడంతో అంతా షాకయ్యారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తాడని ముందు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తమన్ ఫైనల్ అయ్యాడు. ఇప్పటికే తన బీజీఎంలతో అదరగొడుతున్న తమన్ పవన్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు అనగానే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది ఓజీ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. #PawanKalyan, #FireStormIsComing #TheyCallHimOG హ్యాష్‌ట్యాగ్స్‌కు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Exit mobile version