Home Entertainment Ponnambalam | తమ్ముడు చంపాలని చూస్తే.. చిరంజీవి ప్రాణాలు నిలబెట్టారు.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు

Ponnambalam | తమ్ముడు చంపాలని చూస్తే.. చిరంజీవి ప్రాణాలు నిలబెట్టారు.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు

Ponnambalam | తమ్ముడు చంపాలని చూస్తే మెగాస్టార్ చిరంజీవి నా ప్రాణాలు కాపాడారు అంటూ ప్రముఖ నటుడు పొన్నంబలం భావోద్వేగానికి గురయ్యాడు. కిడ్నీ సంబంధ సమస్యల నుంచి కోలుకున్న పొన్నంబలం తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశాడు.

సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్తి కోసం సొంత వాళ్లే ఇబ్బంది పెట్టారని, మెగస్టార్ చిరంజీవి తనకు జీవితాన్ని ఇచ్చారంటూ తెలిపాడు. మా తండ్రికి ముగ్గురు భార్యలు. మూడో భార్య కుమారుడిని సొంత తమ్ముడిగా భావించి మేనేజర్ గా పెట్టుకుంటే నేను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అంతే కాదు.. తినే ఆహారంలోనూ విషం కలపడం వల్లే తన కిడ్నీలు పాడయ్యాయని పేర్కొన్నాడు. డబ్బు కోసం నాపై చేతబడి కూడా చేయించారంటూ వాపోయాడు. తాను మద్యం తాగడం వల్లే కిడ్నీలు పాడయ్యాయని ప్రచారం జరిగింది కానీ నా బాడీ విషతుల్యం కావడం వల్లే కిడ్నీలు పాడయ్యాయి అంటూ తెలిపాడు. ఇదే విషయాన్ని వైద్యులు చెప్పారని అన్నాడు.

తాను కిడ్నీలు పాడై దయానీయ పరిస్థితిలో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశానని చెప్పాడు. వెంటనే స్పందించిన చిరంజీవి తన ప్రాణాలను నిలబెట్టాడని చెప్పారు. ” కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు చికిత్సకు అవసరమైన డబ్బు నా దగ్గర లేదు. ఎవరిని అడగాలో తెలియని సమయంలో చిరంజీవి గుర్తొచ్చారు. ఆయనకు ఫోన్ చేసి నా సమస్య చెప్పాను. ఎంతో కొంత సాయం చేయమని అడిగాను. తాను ఇలా అడిగానో లేదో సాయం చేస్తానని చెప్పారు. దీంతో నేను లక్ష రూపాయలో రెండు లక్షలో సాయం చేస్తారని అనుకున్నా. కానీ ఐదు నిమిషాల్లో ఫోన్ చేసి అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. రిపోర్టులు తీసుకెళ్లి అక్కడ జాయిన్ అవ్వు అని చెప్పారు. నేను ఎంట్రీ ఫీజు కూడా చెల్లించలేదు. చికిత్స పూర్తయ్యే వరకు దాదాపు రూ. 40 లక్షలు అయింది. అంతా చిరంజీవి గారే చూసుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడే ఉంటాను ” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు పొన్నంబలం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version