Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentDhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Dhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Dhamaka review | క్రాక్‌ సినిమాతో హిట్‌ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు మాస్‌ మహారాజా రవితేజ. దాన్ని నిలబెట్టుకోవడానికి రవితేజ చాలా కష్టపడుతున్నాడు. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే తన పాత మాస్‌ ఎనర్జిటిక్‌ యాంగిల్‌ను ట్రై చేస్తూ ధమాకా సినిమాతో వచ్చాడు. ఈసారి ఎలాగైనా మాస్‌ హిట్‌ కొట్టాలని క్రిస్మస్‌ కానుకగా తన సినిమాను తీసుకొచ్చాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఈజ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడా? లేదా చూద్దాం..

కథేంటి?

నందగోపాల్‌ చక్రవర్తి ( సచిన్‌ ఖేడ్కర్ ) పెద్ద బిజినెస్‌ మ్యాన్‌. పీపుల్స్‌ మార్ట్‌ కంపెనీకి అధినేత. అతని కొడుకు ఆనంద్‌ చక్రవర్తి (రవితేజ) తండ్రికి సాయంగా ఉంటాడు. నెలరోజుల్లో చనిపోతానని తెలుసుకున్న చక్రవర్తి.. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ భాగస్వాములుగా ప్రకటిస్తాడు. ఇదే సమయంలో ఇండియాలో నంబర్‌ వన్‌ కంపెనీలను లాక్కొంటూ వస్తుంటాడు జేపీ ఆర్బిట్‌ అధిపతి జేపీ (జయరాం). చక్రవర్తి చనిపోబోతున్నాడని తెలిసి పీపుల్‌ మార్ట్స్‌ కంపెనీని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. ఇందుకోసం అడ్డుగా ఉన్న ఆనంద్‌ చక్రవర్తిని చంపేయాలని అనుకుంటాడు.

మరి జేపీని ఆనంద్‌ ఎలా ఎదుర్కొన్నాడు. ఆనంద్‌ పోలికలతోనే ఉన్న సాధారణ మధ్యతరగతి యువకుడు స్వామి (రవితేజ) ఎవరు? వీరిద్దరి మధ్య రిలేషన్‌ ఏంటి? ఇంతకీ ప్రణవి ( శ్రీలీల) ఇష్టపడింది ఎవర్ని? స్వామి, ఆనంద్‌ చక్రవర్తి ఇద్దరూ ఒకరే అనుకుని ప్రేమలో పడిన ప్రణవి పరిస్థితేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

తెలుగు ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూసిన కథనే అటు తిప్పి, ఇటు తిప్పి ధమాకాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాకపోతే దీనికి కాస్త కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. దీనికి మాస్ మహారాజా రవితేజ తోడయ్యాడు. రవితేజ స్టైల్‌ కామెడీ మిస్సవుతాన్నమని ఫీలయ్యే ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది. రాజా ది గ్రేట్‌ తర్వాత మళ్లీ అంతటి ఎనర్జిటిక్‌గా కనిపించాడు. రవితేజ నుంచి ఫ్యాన్స్‌ ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. కాకపోతే సినిమాలోనే కథ, కథనం పాతదే. సినిమా స్టార్టయిన కాసేపటికే కథేంటో అర్థమైపోతుంది. రవితేజ ఒక్కరా? ఇద్దరా అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ అదేదో పెద్ద ట్విస్ట్‌ అయినట్టుగా ఇంటర్వెల్‌లో రివీల్‌ చేస్తాడు. కానీ క్లైమాక్స్‌ దాకా విలన్లకు ఈ విషయం అర్థం కాదు. సెకండాఫ్‌ రొటీన్‌గా ఉంటుంది. చాలా సన్నివేశాలు రాముడు-భీముడు, రౌడీ అల్లుడు సినిమాలను గుర్తు తెస్తాయి. సెకండాఫ్‌లో సాగదీత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. రవితేజకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా అంతగా కనెక్ట్‌ అవ్వదు. కథ, లాజిక్కులను మరిచిపోతే సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చు.

ఎవరెలా చేశారంటే..

చాలా రోజుల తర్వాత మళ్లీ పాత రవితేజను తెరపై చూస్తారు. తనదైన కామెడీ, ఎనర్జీని చూపించాడు. క్లాస్‌, మాస్‌ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. రెండు పాత్రలకు వేరియషన్‌ చక్కగా చూపించాడు. సరైన మాస్‌ స్టోరీ తగిలితే ఎలా ఉంటుందో ధమాకాతో చూపించాడు. శ్రీలీల అందంగా కనిపించింది. యాక్టింగ్‌ కంటే కూడా ఆమె డ్యాన్సులకే ఎక్కువ పేరొచ్చింది. గతంలో రావు రమేశ్‌ ఇలాంటి పాత్రలు చాలానే చేశారు. హైపర్‌ ఆది, రావు రమేశ్‌ మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. హైపర్‌ ఆది కామెడీ జబర్దస్త్‌ను గుర్తు చేస్తుంది. ఇంద్ర స్పూఫ్‌ నవ్వు తెప్పిస్తుంది. విలన్‌గా జేపీ పాత్రకు జయరాం సరిపోలేదనిపిస్తుంది. అతనిలో ఆడియన్స్‌ క్రూరత్వాన్ని చూడలేరు. ఆలీ పాత్ర పరిధి తక్కువగానే ఉంటుంది. సచిన్‌ ఖేడ్కర్‌, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్రొడక్షన్‌ వాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. ప్రసన్నకుమార్‌ స్క్రీన్‌ ప్లేతో మాయ చేశాడు. సాంగ్స్‌ బాగున్నాయి. జింతాక్‌ దండ కడియాల్‌ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. కార్తిక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రాఫీ బాగుంది.

బలాలు

+ వితేజ
+ శ్రీలీల గ్లామర్‌, డ్యాన్స్‌లు

బలహీనతలు

– రొటీన్‌ కథ
– సాగదీత

చివరగా.. ధమాకా.. రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రమే

Follow Us : FacebookTwitter

Read More Articles |

18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News