Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentRashmika Mandanna | రష్మిక బాలీవుడ్‌ ఆశలు అడియాశలేనా? రెండో సినిమా కూడా హెల్ప్‌ కానట్టే...

Rashmika Mandanna | రష్మిక బాలీవుడ్‌ ఆశలు అడియాశలేనా? రెండో సినిమా కూడా హెల్ప్‌ కానట్టే !

Rashmika Mandanna | పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది రష్మిక. ఈమె క్రేజ్‌ చూసి బాలీవుడ్‌ నుంచి కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. ఇదే ఛాన్స్‌ అని బాలీవుడ్‌లో పాగా వేసేందుకు రష్మిక భారీ ప్లాన్స్‌ వేసింది. సెలక్టెడ్‌గా సినిమాలను ఎంచుకుంది. కానీ ఈ అమ్మడికి బాలీవుడ్‌ అంతగా కలిసొచ్చినట్టు అనిపించడం లేదు.

గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది రష్మిక. అమితాబ్‌ బచ్చన్‌ కూతురిగా ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంది. రిలీజ్‌కు ముందు సినిమాకు మంచి బజ్‌ వచ్చింది కానీ థియేటర్‌లోకి వచ్చిన తర్వాతనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. అక్టోబర్‌ 7న రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో రష్మిక మొదటి అడుగే బెడిసి కొట్టింది. పోనీలే మొదటిది ఎలాగూ పోయింది రెండో సినిమాతో అయినా బాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకోవాలని అనుకుంటే అది బిస్కెట్ అయ్యింది. థియేటర్‌లో విడుదల కోసం ఆపసోపాలు పడిన మిషన్‌ మజ్ను సినిమా.. లాస్ట్‌కు ఓటీటీలో రిలీజ్‌కు ఫిక్సయిపోయింది.

సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా 1970 వ దశకం నాటి ప్రేమకథతో మిషన్‌ మజ్ను తెరకెక్కింది మిషన్‌ మజ్ను. దేశభక్తిని జోడించిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా భారత గూఢచారిగా కనిపించాడు. ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి హైప్‌ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా థియేటర్‌ రిలీజ్‌కు నోచుకోలేకపోయింది. చాలా రోజులుగా థియేటర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇక లాభం లేదనుకుని మిషన్‌ మజ్ను సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు మొగ్గుచూపింది చిత్ర బృందం. జనవరి 20 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. సినిమా థియేటర్‌లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే రష్మిక కెరీర్‌కు ఏమైనా ప్లస్‌ అయ్యేది. కానీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది కాబట్టి సినిమాకు ఎలాంటి టాక్‌ వచ్చినా.. రష్మికకు ఇది మైనస్‌ అనే చెప్పాలి.

ఇలా బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని కలలు కన్న రష్మికకు.. గుడ్‌బై, మిషన్‌ మజ్ను సినిమాలు పెద్ద దెబ్బవేశాయి. ఇక రష్మిక చేతిలో ఒక్కటే బాలీవుడ్‌ ప్రాజెక్టు ఉంది. అదే ఎనిమల్‌. సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు రష్మికకు మిగిలిన చివరి ఆశ ఈ సినిమా మాత్రమే. ఈ సినిమాతో అయినా రష్మిక బాలీవుడ్‌లో పాగా వేస్తుందో లేదో !

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News