Home Entertainment RRR | ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అకాడమీ అవార్డు.. ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడమే నెక్ట్స్?

RRR | ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అకాడమీ అవార్డు.. ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడమే నెక్ట్స్?

RRR | రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అవార్డు పంట పండిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసి ఫిదా అయిపోయిన విదేశీయులు సైతం.. ఇందులో పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. రాజమౌళి టేకింగ్, కీరవాణి మ్యూజిక్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్‌కు అందరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. అవార్డులతో సత్కరిస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ ( Golden Globe ) అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరో అవార్డు గెలుచుకుంది.

జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌ ( Japan Academy Award )కు ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంపికైంది. అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో ఈ అవార్డును గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన హిట్ అందుకున్న అవతార్ 2 ( అవతార్ ది వే ఆఫ్ వాటర్ ), టాప్ గన్ మావెరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలు బరిలో నిలిచినప్పటికీ వాటన్నింటినీ దాటుకుని ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అవార్డును సొంతం చేసుకుంది. గత ఏడాది జపాన్‌లో రిలీజైన ఈ సినిమా అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే జపాన్‌లో ఈ చిత్రాన్ని 4 లక్షల మందికిపైగా వీక్షించారు. అక్కడ సినిమా రిలీజై మూడు నెలలు అవుతున్నా ఇంకా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం.

ఇక చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ చిత్రం పోటీపడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ రేసులో ఉంది. అలాగే ఎన్టీఆర్‌కు కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కచ్చితంగా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వస్తుందని భారతీయులే కాదు.. విదేశీయులు కూడా ఆశిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారు?

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Exit mobile version