Home Entertainment Tollywood | ప్రతి సినిమాకు రెండు భాగాలేంటి.. కొంపదీసి కాన్సెప్ట్ అది కాదు కదా!

Tollywood | ప్రతి సినిమాకు రెండు భాగాలేంటి.. కొంపదీసి కాన్సెప్ట్ అది కాదు కదా!

Tollywood | డబ్బులెవరికీ ఊరికే రావడం లేదు.. ఓ పెద్దాయన టీవీలో రోజూ చెప్పే మాట ఇది. అందుకే బడ్జెట్ చూసి పెట్టాలంటూ చిరంజీవి లాంటి అగ్ర హీరోలు పదే పదే చెప్తుంటారు. డబ్బులు కానీ చూసి ఖర్చు పెట్టకపోతే కచ్చితంగా నిర్మాతలకు నష్టాలు తప్పవని ఆయన ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా మన దర్శకులు మాత్రం స్టార్ హీరోలతో ఒక్కో సినిమా కోసం వందల కోట్లు పెట్టిస్తున్నారు. అదంతా ఒకే సినిమాతో రావాలంటే చాలా కష్టం. సినిమా ఏ మాత్రం అటూ ఇటైనా మొదటికే మోసం రావడం ఖాయం. దానికోసమే ఇప్పుడు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అదే డబుల్ డోస్.. పెద్ద సినిమాలను ఒక్క భాగంలో కాకుండా రెండు భాగాలుగా చేయాలని చాలా మంది దర్శకులు కథలు భారీగా రెడీ చేస్తున్నారు.

బాహుబలి రెండు భాగాలుగా వచ్చి రూ.2400 కోట్లు వసూలు చేసింది.. అలాగే కేజీఎఫ్ 2 పార్ట్స్ 1600 కోట్లు వసూలు చేసింది. పుష్ప మొదటి భాగమే 350 కోట్లు వసూలు చేసింది. దాంతో మిగిలిన దర్శకులు కూడా తమ సినిమాలను రెండు భాగాలుగా చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో చాలా వరకు భారీ సినిమాలు 2 పార్ట్స్‌గా రాబోతున్నాయి. నిన్నటి వరకు ఒకే భాగం అనుకున్న ప్రభాస్ సలార్ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. దీని బడ్జెట్ 300 కోట్ల వరకు అవుతుంది. ఎలాగూ ప్రభాస్‌కు పాన్ ఇండియన్ మార్కెట్ ఉంది కాబట్టి రెండు భాగాలు చేయాలని ఫిక్సయిపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 2023లో తొలిభాగం రిలీజ్ చేసి.. రెండో పార్ట్ కోసం మరో ఏడాది టైమ్ తీసుకోవాలని చూస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు సుజీత్ OG సైతం రెండు భాగాలుగా రాబోతుంది. వీటి బడ్జెట్ కూడా వందల కోట్లే ఉంది. అందుకే ఒక భాగం అయితే వీటిని భరించడం కష్టం.. రికవరీ కూడా కష్టమే అని ఫిక్సయిపోయిన తర్వాతే రెండు భాగాలుగా సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారేమో అనిపించక మానదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే. ఒక్కటి మాత్రం నిజం.. ఇందులో ఎంత లాభం ఉందో.. ఫ్లాప్ అయితే అంతకంటే ఎక్కువ నష్టం కూడా ఉంటుంది. రెండు పార్ట్‌లు హిట్టయితే వేల కోట్లు వచ్చాయి కదా అని మురిసిపోవచ్చు.. అదే ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ బయోపిక్ పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కథానాయకుడు కనీసం రూ.18 కోట్లైనా వసూలు చేసింది.. కానీ సెకండ్ పార్ట్ మాత్రం కేవలం 4 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ రిస్క్ తీసుకున్న తర్వాతే రెండు భాగాలకు ఫిక్సవ్వాలి నిర్మాతలు. లేదంటే ముప్పు తప్పదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Exit mobile version