Home Entertainment Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ

Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ

Tarakaratna | తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు చెప్పడంతో ఎప్పటికప్పుడు తారకరత్న హెల్త్ అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ స్పందించాడు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని బాలయ్య స్పష్టం చేశాడు. ఆరోగ్యం క్షీణించడం లేదని.. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. నారాయణ హృదయాలయ వైద్యులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తారకరత్నకు స్టంట్ వేయడం కుదరలేదని.. మళ్లీ ఎటాక్ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నాడని తెలిపారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు నందమూరి ఫ్యామిలీ ఒక్కొక్కరుగా బెంగళూరు ఆస్పత్రికి వస్తున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, మోహన్ కృష్ణ, భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, సుహాసిని తదితరులు వచ్చి తారకరత్న పరిస్థితిని ఆరా తీశారు. తాజాగా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ ప్రత్యేక విమానంలో తమ కుటుంబ సభ్యులతో ఆస్పత్రికి వచ్చారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా బెంగళూరు నారాయణ హృదయాలయకు వచ్చి నందమూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా శివన్న ఆకాంక్షించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

Exit mobile version