Home Entertainment Waltair Veerayya Collections | చిరంజీవి మెగా మేనియా.. బాక్సాఫీసు దగ్గర దుమ్ముదులుపుతున్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Collections | చిరంజీవి మెగా మేనియా.. బాక్సాఫీసు దగ్గర దుమ్ముదులుపుతున్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Collections | రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాడు. రీఎంట్రీ మూవీ కాబట్టి ఖైదీ నంబర్ 150 సినిమాకు మంచి బజ్ వచ్చింది. కలెక్షన్లు కూడా వచ్చాయి. రీఎంట్రీ తర్వాత అన్ని సీరియస్ సబ్జెక్ట్స్‌పైనే చిరు ఫోకస్ చేశాడు. కానీ అవి అభిమానులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సైరా ఫర్వాలేదనిపించింది. ఆచార్య మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి నటించినప్పటికీ ఈ సినిమా భారీ నష్టాలు చవిచూసింది. గాడ్‌ఫాదర్ సినిమా ఓకే అనిపించింది. కానీ వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ లుక్‌లో కనిపించడమే కాదు.. తన స్టైల్ మాస్ కామెడీని చూపించాడు. ఇంకేముందు మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేస్తూ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.

వాల్తేరు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన దమ్ము చూపిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. మొత్తంగా 9 రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్ ( రూ.106 కోట్ల షేర్ ) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ చూస్తే.. తెలంగాణలో రూ.28.87 కోట్లు, రాయలసీమ లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.13.34 కోట్లు, తూర్పు గోదావరి. రూ.9.26 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 5.13 కోట్లు, గుంటూరు రూ. 6.72 కోట్లు, కృష్ణ రూ. 6.47 కోట్లు, నెల్లూరు రూ. 3.38 కోట్లు, తెలంగాణ+ ఆంధ్ర మొత్తం కలిపి రూ.88.37 కోట్లు వసూళ్లు సాధించింది

ఓవర్సీస్‌లో కూడా వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద 2.2 మిలియన్‌ డాలర్ల మార్క్ క్రాస్‌ చేసి ఔరా అనిపించింది. గతంలో చిరంజీవి ఖైదీ నంబర్‌ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు కూడా యూఎస్‌ లో 2 మిలియన్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేసింది. 2 మిలియన్‌ యూఎస్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేసిన మూడో చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

Exit mobile version