Home Entertainment Chiranjeevi | తన దగ్గరకు వచ్చిన సినిమాకు రాజశేఖర్‌ను రికమెండ్‌ చేసిన చిరంజీవి

Chiranjeevi | తన దగ్గరకు వచ్చిన సినిమాకు రాజశేఖర్‌ను రికమెండ్‌ చేసిన చిరంజీవి

Image Source : Twitter

Chiranjeevi and Rajasekhar | టాలీవుడ్‌లో చిరంజీవి, రాజశేఖర్‌ మధ్య వివాదం గురించి అందరికీ తెలిసిందే. తనకు వచ్చిన ఆఫర్లను కొట్టేసి.. తనను తొక్కేశాడని మెగాస్టార్‌పై రాజశేఖర్‌ గుర్రుగా ఉంటారని ఒక టాక్‌ ఉంది. అందుకే మెగా ఫ్యామిలీ అంటే రాజశేఖర్‌కు గిట్టదని అంటారు. కానీ చిరంజీవి చేయాల్సిన ఒక పాత్రను తనకంటే రాజశేఖర్‌ అయితేనే బాగా చేయగలడని రికమెండ్‌ చేశాడన్న సంగతి మీకు తెలుసా! అలా చిరు సిఫారసు చేసిన సినిమా చేసి రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ కూడా అందుకున్నాడు. ఈ విషయాన్ని యంగ్రీ యంగ్‌మ్యాన్‌ రాజశేఖరే స్వయంగా అప్పట్లో ఈ విషయాన్ని చెప్పాడు. ఇంతకీ అదే సినిమా అనుకుంటున్నారా? రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన న్యాయం కోసం సినిమా.

ఒరు సీబీఐ డైరీ కురిప్పు అనే మలయాళ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం గురించి రాజశేఖర్‌కు తెలిసింది. వెంటనే తనతో కమిటైన నిర్మాతలలో ఒకరితో ఆ సినిమా హక్కులను కొనుగోలు చేయించి నటించాలని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆ సినిమా రైట్స్‌ను అల్లు అరవింద్‌ కొనుగోలు చేశారని రాజశేఖర్‌కు తెలిసింది. అల్లు అరవింద్‌ దగ్గర హక్కులు ఉన్నాయంటే కచ్చితంగా చిరంజీవితోనే ఆ సినిమా తీస్తారని ఊహించి రాజశేఖర్‌ అప్‌సెట్‌ అయ్యాడు. మలయాళ వర్షన్‌ చూసి చిరంజీవి లక్కీ పర్సన్‌ అని అనుకున్నాడు. మంచి సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్సయ్యానని తెగ ఫీలైపోయాడు. ఆ తర్వాత ఆ సినిమా గురించి మరిచిపోయి తన పనిలో పడిపోయాడు.

ఇది జరిగిన కొద్దిరోజులకు ఒక చిత్రం వంద రోజుల వేడుకలో రాజశేఖర్‌, అల్లు అరవింద్‌ కలుసుకున్నారు. వాళ్ల మాటల మధ్యలో ఒరు సీబీఐ డైరీ కురిప్పు హక్కులు ఉన్నాయని.. అందులో నటిస్తావా? అని రాజశేఖర్‌ను అల్లు అరవింద్‌ అడిగాడు. ఆ మాటతో ఒక్కసారి షాకైపోయిన రాజశేఖర్‌ తప్పకుండా నటిస్తానని అంగీకారం తెలిపాడు. ఆ వెంటనే తన మనసులో మాట కూడా బయటపెట్టాడు. మీరు రైట్స్‌ తీసుకున్నారు అనగానే చిరుతోనే రీమేక్‌ చేస్తారని అనుకున్నా.. కానీ ఇంత మంచి క్యారెక్టర్‌ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌ అంటూ అల్లు అరవింద్‌కు రాజశేఖర్‌ కృతజ్ఞతలు చెప్పాడు.

అప్పుడు అరవింద్‌ అసలు విషయం చెప్పుకొచ్చాడు. మొదట చిరంజీవితోనే సినిమా తీద్దామని అనుకున్నాం.. కానీ ఆయన కాల్షీట్స్‌ సమస్య ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే చిరంజీవినే స్వయంగా మీ పేరు రికమెండ్‌ చేశారని తెలిపాడు. దీంతో చిరుని కలిసి రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో న్యాయం కోసం పేరుతో రీమేక్‌ చేశారు. తెలుగులో ఈ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ఈ సినిమా అభినందన సభలోనే రాజశేఖర్‌ ఈ విషయం మొత్తం చెప్పుకొచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

Exit mobile version