Home Entertainment Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Ram Charan | ఈ మధ్య రామ్ చరణ్ పేరు గ్లోబల్ వైజ్ గా ట్రెండింగ్ అవుతుంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏను నటన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచం దిగ్గజ దర్శకులైన జేమ్స్ కామరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి వాళ్లు ట్రిపుల్ ఆర్ సినిమా చూసి రామరాజు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అందులో నటించిన రామ్ చరణ్ నటన గురించి మరింత ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించారు.

ఆ క్యారెక్టర్ ను ఆయన క్యారీ చేసిన విధానం.. సినిమా అంతా కథను మోసిన పద్ధతి వాళ్లకు చాలా బాగా నచ్చేసింది. ఒక పెద్ద విస్ఫోటనం మనసులో దాచుకొని దాన్ని బయటకి కనిపించకుండా.. ఆ కొండంత భారాన్ని మోస్తూ క్యారెక్టర్ ను పండించిన తీరు చూసి రామ్ చరణ్ నటనకు నీరాజనాలు పలికారు ప్రేక్షకులు.
దాంతో మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్లో భాగంగా అందరూ రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డులో కూడా సినిమా నామినేట్ కావడంతో.. దాని ప్రమోషన్ కోసం 20 రోజుల ముందే అమెరికా చేరుకున్నాడు చరణ్. ఈ మధ్య అయ్యప్ప మాల ధారణ చేసిన మెగా వారసుడు.. అమెరికా కూడా అలాగే వెళ్లిపోయాడు. రేపు ఆస్కార్ అవార్డులో కూడా మాలలోనే దర్శనం ఇస్తాడు అనే ప్రచారం జరుగుతుంది.

ఒకవేళ ఇదే జరిగితే ఇండియన్ ట్రెడిషన్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కూడా రామ్ చరణ్ సొంతం అవుతుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డులో స్టైలిష్ ఐకాన్ గా కనిపించిన చరణ్.. ఇప్పుడు అయ్యప్ప మాలధారణతో ఇండియన్ ట్రెడిషన్ కు ఐకాన్ గా మారిపోయాడు. రాబోయే పది రోజులు అమెరికాలోనే ఉండబోతున్నాడు చరణ్.
తమ సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్నమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయబోతున్నాడు మెగా వారసుడు.

ఆయన కోసం ప్రత్యేకంగా విడిది కూడా ఏర్పాటు చేశారు ఆస్కార్ కమిటీ. మార్చి మొదటి వారంలో ఇండియాకు వచ్చి శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు ఈ హీరో. వారం రోజుల షెడ్యూల్ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లనున్నాడు.

తమ సినిమాకు ఆస్కార్ వస్తే స్టేజ్ మీదే ఎన్టీఆర్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తానని ఇంతకుముందే చెప్పాడు చరణ్. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నట్టు తెలిపాడు. మార్చి 12న లాస్ ఎంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక అత్యంత ఘనంగా జరగనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version