Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentMasooda in OTT | ఓటీటీలో భయపెట్టేందుకు సిద్ధమైన మసూద.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Masooda in OTT | ఓటీటీలో భయపెట్టేందుకు సిద్ధమైన మసూద.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Masooda in OTT | ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది మసూద. దెయ్యాల సినిమాలు కామెడీగా మారిపోయిన ఈ రోజుల్లో పర్‌ఫెక్ట్‌ హర్రర్‌ మూవీగా వచ్చిన మసూద ఆడియన్స్‌ను బాగానే ఇంప్రెస్‌ చేసింది. సంగీత, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా నవంబర్‌ 18న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మసూద ఓటీటీలో కూడా భయపెట్టేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ( Aha platform ) వేదికగా మసూద సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నెల 21 నుంచి మసూద సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ఆహా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టర్‌ను ఉంచింది. దీంతో హారర్‌ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సైన్స్‌ టీచర్‌ నీలమ్‌ ( సంగీత ) తన భర్త (సత్య ప్రకాశ్‌)తో విడాకులు తీసుకుంటుంది. తన కూతురు నాజియా (బాంధవి శ్రీధర్‌)తో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. వీళ్ల పక్కింట్లో ఉండే కుర్రాడు గోపీ (తిరువీర్‌) నీలమ్‌కు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇలాంటి సమయంలో నాజియా ప్రవర్తనలో మార్పు వస్తుంది. దెయ్యం పట్టిన నాజియాను గోపీ సాయంతో నీలమ్‌ ఎలా కాపాడుకున్నది అనేది సినిమా స్టోరీ.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

Sushant singh rajput | సుశాంత్‌ మరణించిన ఫ్లాట్‌ అంటేనే భయపడిపోతున్నారట.. అందుకే రెండున్నరేళ్లయినా ఖాళీగానే ఉంది

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News