Home Entertainment Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ...

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Divyansha Kaushik | సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య చాలా హుందాగా వ్యవహరించాడు. ఎక్కడా తన పర్సనల్ విషయాలను బయటపెట్టలేదు. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా సైలెంట్‌గా ఉన్నాడు. సమంత అయినా ఒకటి రెండు సార్లు విడాకుల గురించి మీడియా ముందు మాట్లాడింది.. కానీ చైతూ మాత్రం దీనిపై నోరు మెదిపేందుకు ఇష్టపడలేదు. కానీ కొద్దిరోజులుగా ఆయన ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

మొన్నటి దాకా తెలుగందం శోభితా దూళిపాళ్లతో చైతూ డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. కాగా ఇప్పుడు మరో వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తో చైతూ ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్ వినిపిస్తుంది. మజిలీ తర్వాత ఆఫర్స్ లేకుండా ఉన్న దివ్యాంశ కౌశిక్‌కు రామారావు ఆన్ డ్యూటీలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడానికి కూడా నాగచైతన్యనే కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దివ్యాంశ కౌశిక్ స్పందించింది.

నాగ చైతన్య చాలా బాగుంటాడని.. ఐ లవ్ చైతూ అని చెప్పింది. అతనిపై తనకు క్రష్ ఉందని.. కానీ తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీలో అవకాశం రావడానికి నాగచైతన్యనే కారణమంటూ వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

Exit mobile version