Home Entertainment Sharwanand | శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా..

Sharwanand | శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా..

Sharwanand | ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని ప్రేమించిన శర్వా.. ఆమెతోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. పెళ్లి వార్త కన్ఫార్మ్ అని తెలిసినప్పటికీ శర్వా చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ గురించి మాత్రం ఇన్ని రోజులు బయటకు రాలేదు. కానీ వీళ్ల ఎంగేజ్‌మెంట్ టైమ్ దగ్గరపడటంతో పూర్తి వివరాలు తెలిశాయి.

ఈ నెల 26న ( గురువారం ) వసంత పంచమి నాడు శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ జరగబోతుంది. ఈ క్రమంలో శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు వెల్లడయ్యాయి. ఆ అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు. ఏపీ మాజీ మంత్రి, చిత్తూరులోని శ్రీకాళహస్తి నుంచి నాలుగుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనుమరాలు. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రక్షితా రెడ్డి.. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటోంది. రక్షితా రెడ్డి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుందని సమాచారం. రక్షితా రెడ్డిని శర్వానంద్ ఓ స్నేహితుడి ద్వారా కలిశాడని.. వాళ్ల అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీనికి పెద్దలు కూడా ఒప్పుకొని పెళ్లికి ఏర్పాట్లు చేశారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు అయితే శర్వానంద్ – రక్షితా రెడ్డి ఎంగేజ్‌మెంట్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎంగేజ్‌మెంట్ పూర్తయిన తర్వాత డైరెక్ట్‌గా పెళ్లి తేదీనే ప్రకటిస్తారేమోనని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఏప్రిల్‌లో వీరి పెళ్లి ఉండబోతుందని మాత్రం తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

Exit mobile version