Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentNandamuri Tarakaratna | తారకరత్న చేతిపై బాలయ్య టాటూ.. బాబాయ్‌ అంటే ఎంత ప్రేమో !!

Nandamuri Tarakaratna | తారకరత్న చేతిపై బాలయ్య టాటూ.. బాబాయ్‌ అంటే ఎంత ప్రేమో !!

Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది మొదలు బాలకృష్ణనే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నాడు. కంటి మీద కునుకు లేకుండా ఆస్పత్రిలో ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాడు. అదంతా చూసి అన్న కొడుకు అంటే బాలయ్యకు ఎంత అభిమానమో అని అభిమానులంతా అనుకున్నారు. అయితే తారకరత్న అంటే బాలయ్యకు ఎంత ప్రేమ ఉందో.. బాబాయ్‌ అంటే తారకరత్నకు కూడా అంతే ప్రేమ ఉంది. అందుకు అతని చేతి మీద ఉన్న టాటూనే నిదర్శనం !

తారకరత్న భుజం మీద ఓ సింహం బొమ్మ ఉంటుంది. అది తన బాబాయ్‌ బాలకృష్ణ మీద అభిమానంతోనే ఆ బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. అంతేకాదు ఆ లయన్‌ బొమ్మ కింద బాలకృష్ణ ఆటోగ్రాఫ్‌ కూడా ఉంటుంది. ఇది చూసిన తర్వాత బాబాయ్‌ అంటే అబ్బాయికి ఎంత ప్రేమో కదా అని తలచుకుంటూ నందమూరి అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఈ సందర్భంగానే మరో విషయం కూడా వైరల్‌గా మారింది.

తారకరత్న కెరీర్‌ పరంగా సక్సెస్‌ కావాలని ఆశపడ్డ వాళ్లలో బాలకృష్ణ ఒకరు. భారీ అంచనాలతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తారకరత్న సక్సెస్ కాలేకపోయాడు. కానీ నటుడిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తారకరత్నతో కలిసి ఒక సినిమాలో నటించాలని బాలయ్య ఆశపడ్డాడు. దీంతో అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో తారకరత్నను కీలక పాత్రలో నటింపజేసేందుకు ప్లాన్‌ కూడా చేశాడు. ఈ సినిమాతో తారకరత్న కెరీర్ మళ్లీ టర్న్‌ తీసుకుంటుందని అనుకున్నాడు. కానీ ఇంతలోనే తారకరత్న మరణించడం ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News