Home Entertainment Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Megastar Chiranjeevi | ఒకప్పుడు డిజిటల్ లో నటించడానికి ప్రత్యేకంగా కొందరు నటులు ఉండేవాళ్ళు. వెబ్ సిరీస్ లకు వాళ్లు పెట్టింది పేరు. సినిమాల కంటే బుల్లితెరపైనే ఎక్కువగా నటిస్తూ పేరు తెచ్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ రేంజ్ పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇటు వైపు అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్లో అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ లాంటి స్టార్స్ డిజిటల్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. సౌత్ లో కూడా ఇదే ట్రెండ్ మొదలైంది. తెలుగులో బాలకృష్ణ ఒక టాక్ షోకు హోస్ట్ గా మారి ఇండియాలోనే దాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాడు. దానికి తోడు నాగార్జున కూడా ఇప్పటికే బుల్లితెరపై సత్తా చూపిస్తున్నారు. డిజిటల్ మీడియాలో తనదైన ముద్ర వేసుకున్నారు.

బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ సైతం తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో తన అన్న కొడుకు రానాతో కలిసి నటిస్తున్నాడు వెంకటేష్. మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో ఇది ప్రసారం కానుంది.

ఇప్పటికే సీనియర్ హీరోల్లో ముగ్గురు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. దాంతో చిరంజీవి ఎప్పుడు వస్తాడు అనేదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కథ నచ్చితే వెబ్ సిరీస్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని ఇదివరకే చెప్పాడు చిరంజీవి. ఎందుకంటే డిజిటల్ మీడియా రేంజ్ ఇప్పుడు బాగా పెరుగుతుందని.. తనకు కూడా అటువైపు రావాలి అనే ఆలోచన ఉంది అంటూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రమోషన్ టైమ్ లోనే చెప్పాడు. కాకపోతే ఇప్పటివరకు తనకు అలాంటి స్క్రిప్ట్ రాలేదని.. ఒకవేళ వస్తే మాత్రం కచ్చితంగా వెబ్ సిరీస్ చేయడానికి ముందు ఉంటాను అని మెగాస్టార్ అనౌన్స్ చేశాడు.

అందుకే ఆయన కోసం కేవలం సినిమా స్క్రిప్టులు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ కథలు కూడా రాయాలి అంటూ అభిమానులు ఈ జనరేషన్ దర్శకులను కోరుతున్నారు. ఒకవేళ అన్నీ కుదిరి చిరంజీవి నిజంగానే వెబ్ సిరీస్ చేస్తే మాత్రం అంతకు మించి సంచలనం మరొకటి ఉండదు. అలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్నాడు. దీని తర్వాత పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఏదేమైనా సినిమాలతో పాటు డిజిటల్ పై కూడా ఒక కన్నేశాడు చిరంజీవి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version