Home Entertainment Alia Bhatt | మూడు నెలల కిందటే పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్.. మళ్లీ తల్లి...

Alia Bhatt | మూడు నెలల కిందటే పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్.. మళ్లీ తల్లి కాబోతుందా?

Alia Bhatt | చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు మూడు నెలల్లోనే తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించి అందరికీ షాకిచ్చింది ఆలియా భట్‌. గత ఏడాది నవంబర్‌లోనే పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా కపూర్‌ అని పేరు కూడా పెట్టారు. కానీ ఇప్పటివరకు రాహా ఫొటోలను బయటకు రానివ్వలేదు. రెండేళ్ల పాటు తమ పాప ప్రైవసీకి సహకరించాలని ఆలియా, రణ్‌బీర్‌ జంట మీడియాను కోరింది. వాళ్ల రిక్వెస్ట్‌ను మన్నించి మీడియా కూడా ఎక్కడా రాహా ఫొటోలను లీక్‌ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆలియా భట్‌ రెండోసారి గర్భం దాల్చిందనే వార్తలు ఇప్పుడు బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.

ఆలియా భట్‌ మళ్లీ ప్రెగ్నెంట్ అనే వార్తలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. రెండు పువ్వులను పట్టుకున్న ఫొటోను ఇటీవల ఆలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీనికి 2.0 స్టే ట్యూన్‌డ్‌ అని రాసుకొచ్చింది. దీంతో ఆలియాభట్‌ ప్రెగ్నెన్సీపై ఊహగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా ఏడెమమ్మా బ్రాండ్‌కు చెందిన మెటర్నిటీ కలెక్షన్స్‌ ధరించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంది. దీంతో ఆలియా భట్‌ మళ్లీ గర్భం ధరిచిందని పలువురు కన్ఫార్మ్‌ చేసేస్తున్నారు. అన్నట్టు ఏడేమమ్మా బ్రాండ్‌కు యజమాని ఆలియా భట్‌నే. కాబట్టి తన బ్రాండ్‌కు తనే ప్రమోట్‌ చేస్తుందని అనుకోవచ్చు. కానీ అక్టోబర్‌ 2020లో ఆలియా భట్‌ ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. అప్పట్నుంచి ఎప్పుడూ ఈ కలెక్షన్స్‌ను తాను వేసుకోలేదు. కనీసం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా వీటి గురించి పోస్టులు చేయలేదు. అలాంటిది ఉన్నట్టుండీ ఇప్పుడు మెటర్నిటీ బ్రాండ్‌ దుస్తుల గురించి వరుసగా ప్రమోట్‌ చేస్తుండటంతో పలువురు అనుమానిస్తున్నారు. ఆలియా భట్‌ రెండోసారి ప్రెగ్నెంట్‌ అంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

Exit mobile version