Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentRajinikanth | రజినీకాంత్ చేసిన పనికి డైలమాలో ఫ్యాన్స్.. నవ్వాలా ఏడవాలా..?

Rajinikanth | రజినీకాంత్ చేసిన పనికి డైలమాలో ఫ్యాన్స్.. నవ్వాలా ఏడవాలా..?

Rajinikanth | ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన రజనీకాంత్.. 2000 తర్వాత తన జోరు తగ్గించాడు. వయసుకు గౌరవం వచ్చి ఏడాదికి ఒక సినిమా లేదంటే.. అప్పుడప్పుడు రెండు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక గత పదేళ్ల నుంచి అయితే రజినీకాంత్ నుంచి రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా రావడం గగనంగా మారిపోయింది.

పైగా ఒకప్పట్లా రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించడం లేదు. అందుకే ఆయన కూడా సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇదివరకటి మాదిరి ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఒకప్పుడు ఎంత వేగంగా సినిమాలు చేసినా కూడా వయసు ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆయన వయసు 70 పైనే.

Read more: Nagarjuna | కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోతున్నాడా!

ఇలాంటి సమయంలో కూడా వరుస సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా గతేడాది పెద్దన్న సినిమా సమయంలో రజినీకాంత్ అనారోగ్యం పాలవడం.. ఆ షూటింగ్ జరుగుతున్న స్థలం అంతా ఒక హాస్పిటల్ వాతావరణం తలపించడంతో ఇకనుంచి రజనీకాంత్ సినిమాలు చేయకపోవడమే మంచిది అంటూ అభిమానులు కూడా కోరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే అదే చాలు.. సినిమాలు చేసిన చేయకపోయినా పెద్దగా పట్టించుకోము అని సోషల్ మీడియాలో కామెంట్ కూడా చేశారు.

Read more: Chiranjeevi | ఆటోజానీ ఎక్కడ.. ఉందా? పక్కన పడేసావా.. పూరీ జగన్నాథ్ కు చిరు స్ట్రెయిట్ క్వశ్చన్..

కేవలం ఈ అనారోగ్యం కారణంగానే రజినీకాంత్ పూర్తిగా పాలిటిక్స్ నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30% పూర్తయింది.
దీని తర్వాత మళ్లీ భారీ బ్రేక్ తప్పదు అనుకుంటున్న సమయంలో లైకా ప్రొడక్షన్ హౌస్ తో ఏకంగా రెండు సినిమాల డీల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

గతంలో వీళ్ళు 2.0 సినిమాను నిర్మించడంతో పాటు.. మరికొన్ని రజనీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. జైలర్ సినిమా పూర్తి కాగానే ఆ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసి రజిని అభిమానులు షాక్ అవుతున్నారు. అసలే ఆరోగ్యం అంత మాత్రంగా ఉన్న సమయంలో ఇలా వరుస సినిమాలు చేయడం అవసరమా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read more articles | Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా ?

Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News