Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentSuriya Rolex | సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోలెక్స్ మూవీపై లోకేశ్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్...

Suriya Rolex | సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోలెక్స్ మూవీపై లోకేశ్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్

Suriya Rolex | లోకేశ్ కనగరాజ్ ( lokesh kanagaraj ) మల్టీ యూనివర్స్ నుంచి వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఈ రెండు సినిమాలు చూసిన ఆడియన్స్.. వీటి సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తన మల్టీవర్స్ నుంచి లోకేశ్ కనగరాజ్ ఏ సినిమాను ప్రకటిస్తాడా? అని ఉత్సుకతతో చూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ వెయింటింగ్‌కు బ్రేక్ వేస్తూ తాను చేయబోయే సినిమా గురించి వివరాలను పంచుకున్నాడు. ఈ మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కమల్ హాసన్‌తో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్.. రాబోయే పదేళ్లకు సరిపడా సినిమాల షెడ్యూల్ తన దగ్గర ఉన్నట్టు చెప్పాడు. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ఒక సినిమా చేస్తున్నానని తెలిపాడు. అది పూర్తికాగానే విక్రమ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా రోలెక్స్ పాత్ర మీద కూడా ఒక సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. లోకేశ్ చెప్పిన ఈ ఒక్క మాటతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. విక్రమ్ సినిమా క్లైమాక్స్‌లో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్క్రీన్‌పై కనిపించేది కొద్ది క్షణాలే అయినా సరే సూర్య తన యాక్టింగ్‌తో పూనకాలు తెప్పించాడు. రోలెక్స్ క్యారెక్టర్‌ను ఫుల్ లెంగ్త్‌లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయింటిగ్ చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో రోలెక్స్ మూవీ వస్తుందని లోకేశ్ ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. అయితే ఇక్కడే లోకేశ్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సినిమాల్లో ఏవి ఎప్పుడు వస్తాయో ఇప్పుడే చెప్పాలేనని షాకిచ్చాడు. అది ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఏదైనా కావచ్చని చెప్పుకొచ్చాడు. మరి ఈ రోలెక్స్.. లోకేశ్ కనగరాజ్ మల్టీ యూనివర్స్‌కు ఎంత హైప్ తీసుకొస్తుందో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News