Home Entertainment Venkatesh Maha | పెన్ను వదిలి గన్ను పడితే.. వాళ్ల బాబులాంటి సినిమాలు తీస్తా.. కేజీఎఫ్‌...

Venkatesh Maha | పెన్ను వదిలి గన్ను పడితే.. వాళ్ల బాబులాంటి సినిమాలు తీస్తా.. కేజీఎఫ్‌ సహా కమర్షియల్ సినిమాలను తీసిపారేసిన కంచరపాలెం డైరెక్టర్

Venkatesh Maha | కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేశ్ మహా ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్‌గా మారాడు. అంత హాట్ టాపిక్ అయ్యాడంటే ఏదో గొప్ప పని చేశాడని అనుకునేరు. తన నోటి దూలతో దక్షిణాది సినీ ఇండస్ట్రీకి ఖ్యాతి తీసుకొచ్చిన డైరెక్టర్లను కించపరిచేలా మాట్లాడాడు. వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేస్తున్నవి సినిమాలే కావని.. తాను తీసేవే సినిమాలు అన్న రేంజ్‌లో మాట్లాడాడు. వందల, వేల కోట్లు సంపాదిస్తున్న మూవీస్ అన్నీ కూడా పాప్‌కార్న్ మూవీస్ అని తీసిపారేశాడు. వాటిని థియేటర్లలో చూడటం దండగ.. ఓటీటీలో చూడదగ్గ సినిమాలు అంటూ అవమానపరిచాడు. కమర్షియల్ హిట్స్ అందుకోలేక.. పక్క సినిమాలపై ఏడ్చాడు. కేజీఎఫ్ వంటి సినిమాల గురించి కూడా నీచంగా మాట్లాడాడు.

చదవని వాళ్లకే మార్కులు వేస్తున్నారు

ఇంతకీ ఏం జరిగిందంటే.. నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, శివ నిర్వాణతో కలిసి వెంకటేశ్ మహా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. అక్కడ కమర్షియల్ సినిమాలు మాత్రమే సక్సెస్ కావడంపై ప్రస్తావన వచ్చింది. అలాంటి సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం.. అవే వందల కోట్లు, వేల కోట్లు రాబట్టడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ స్టోరీ బాగుంటే డైరెక్టర్లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు కదా అని తెలిపింది. మార్కులు ( కలెక్షన్స్ ) బాగా వచ్చిన విద్యార్థి ( డైరెక్టర్)నే బాగా చదవమని ఎంకరేజ్ చేస్తారు.. చదవని వాడిని ఎంకరేజ్ చేయరు కదా అంటూ ఉదాహరణ చెప్పింది. యాంకర్ మాటలకు వెంకటేశ్ మహా రియాక్ట్ అయ్యాడు. మేం బాగానే చదువుతున్నాం.. కానీ మార్కులు మాత్రం చదవని వాళ్లకు వేస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీనికి కరెక్టే అన్నట్టుగా నందినిరెడ్డి కూడా సపోర్ట్ ఇచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన వెంకటేశ్ మహా.. మనకు మార్కులు కదా ముఖ్యం.. మేం కూడా అలాంటి సినిమాలే చేస్తామని అన్నాడు.

వాళ్ల బాబులాంటి సినిమాలు తీస్తా

మీ ( ఆడియన్స్ ) ప్రొగ్రెసివ్‌‌నెస్‌ను అడ్రస్ చేయడానికి మేం ఇంత కష్టపడి సినిమా తీస్తే.. మీరు గొప్ప సినిమా అని పొగిడితే సరిపోదు. మీరు థియేటర్లకు వస్తే.. ప్రొడ్యూసర్లకు డబ్బులు కనిపిస్తాయని.. అప్పుడే తమకు పేరొస్తుందని పేర్కొన్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. తన సినిమాలకు కలెక్షన్లు రావడం లేదని అసహనం వ్యక్తం చేశాడని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాతనే వెంకటేశ్ మహా శ్రుతి మించి కామెంట్స్ చేశాడు. మాకు ఉన్న క్రెడబిలిటీకి మేం గనుక రేపు పొద్దున వెళ్లి అభ్యుదయ భావాన్ని పక్కనబెట్టి.. పెన్ను బదులు కత్తి పట్టుకుంటే వాళ్ల బాబులాంటి సినిమాలు చేస్తామని స్పష్టం చేశాడు. వయలిన్స్ సినిమాలను కూడా ఏస్థేటికల్‌గా చూపించే శక్తి తమకుందని.. అయినప్పటికీ అలా చేయడం లేదంటూ ఓవర్ కాన్ఫిడెంట్‌తో రెచ్చిపోయాడు. భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలను తీసిపారేస్తూ మాట్లాడాడు.

అవన్నీ ఓటీటీ సినిమాలు.. నా సినిమా కాదు

వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలన్నీ పాప్‌కార్న్ మూవీస్ అంటూ తీవ్రంగా కామెంట్ చేశాడు వెంకటేశ్ మహా. ఆ సినిమాలను పాప్‌కార్న్ సినిమాలు అని ఎందుకు అంటారో కూడా తన యాంగిల్‌లో వివరించాడు. ‘ పాప్‌కార్న్ తింటూ ఒక సినిమా చూస్తుంటాం. పొరపాటున పాప్‌కార్న్ కిందపడితే వంగి తీసుకుంటాం. ఈ లోపు సీన్ మిస్సయినా ఏం ఫర్వాలేదు. కానీ మేం తీసే సినిమాలు అలా కాదు ‘ అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. ఎవరికైనా కథ చెబితే ఇది ఓటీటీ ఫిలిం అని అంటారో వాళ్లందరికీ జ్ఞానోపదేశం చేస్తున్నా. మావి ఓటీటీ సినిమాలు కావు. వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలే ఓటీటీ సినిమాలు. వాటిని ఇంట్లో సోఫాలో కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ కూడా చూడొచ్చు. కానీ మా సినిమాలు అలా కాదు. ఫోకస్‌డ్‌గా చూడాల్సి ఉంటుంది. అంటే డార్క్ రూం ఉండాలి. దానికోసమైనా థియేటర్లకు రావాలి. అంటూ మరో రేంజికి వెళ్లిపోయాడు.

నీచ్‌కమీనేగాడి స్టోరీ చూస్తారా?

‘ ప్రపంచంలో తల్లి ఒక కొడుకును ఎప్పటికైనా గొప్పోడివి కావాలని అంటుంది. గొప్పోడు అంటే ఆమె దృష్టిలో బాగా సంపాదించాలని.. కానీ ఒక సినిమాలో అంతా కావాలని అడుగుతుంది.. ఆ అంత ఏదైతే కావాలని అడుగుతుందో దాన్ని తోడేవాళ్లు కొంతమంది ఉంటారు. వీడెళ్లి వాళ్లను ఉద్ధరిస్తాడు. తర్వాత ఒక పాట వస్తది. లాస్ట్‌కు వాళ్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తడు. మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తడు. వాడంతటి నీచ్ కమీన్ కుత్తే ఎవడన్నా ఉంటాడా? వాడిని కన్న ఆ మహాతల్లిని నాకు కలవాలని ఉంది.మహాతల్లి ఎక్కడైనా ఉంటే కలవాలని ఉంది. అలాంటి కుత్తే ఎవడని తల్లి అడిగితే ఆ కథను సినిమా తీస్తే.. మనం చప్పట్లు కొడతరు.’ అంటూ హద్దులు దాటి మాట్లాడాడు. ఇలా తోటి డైరెక్టర్స్‌ను కించపరిచేలా మాట్లాడితే ఆపాల్సింది పోయి.. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నందినిరెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ పగలబడి నవ్వారు. దీంతో వెంకటేశ్ మహాతో పాటు నందినిరెడ్డి ఇతర డైరెక్టర్లపై కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

దమ్ముంటే ఆ రేంజ్ సినిమా తియ్యు.. మండిపడుతున్న నెటిజన్లు

వెంకటేశ్ మహా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. కేజీఎఫ్ సినిమా పార్కింగ్ కలెక్షన్స్ కూడా సంపాదించలేని నువ్వా.. ఆ సినిమాపై కామెంట్స్ చేసేది అని మండిపడుతున్నారు. దమ్ముంటే కేజీఎఫ్ రేంజ్ కాకపోయినా.. అందులో సగం సత్తా ఉన్న సినిమా అయినా తీసి నిరూపించుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ మహాతో పాటు పక్కనే ఉండి పగలబడి నవ్విన డైరెక్టర్స్‌పై కూడా నెటిజన్లు సీరియస్ అయ్యారు. దీంతో నందిని రెడ్డి స్పందించి క్షమాపణలు చెప్పింది. ప్రతి కమర్షియల్ చిత్రం విజయం సాధిస్తుందంటే.. చిత్ర యూనిట్ శ్రమ ప్రేక్షకులకు నచ్చిందని అర్థం అని.. మేం చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరచాలని కాదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి అని నెటిజన్లను కోరింది. వెంకటేశ్ మహా హావభావాలకు మాత్రమే తనకు నవ్వొచ్చిందని.. కానీ అది ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చిందో ఇప్పుడే తనకు అర్థమైందని క్లారిటీ ఇచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version