Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentBoycott Bollywood | బాలీవుడ్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్లే.. సునీల్ శెట్టి సంచలన...

Boycott Bollywood | బాలీవుడ్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్లే.. సునీల్ శెట్టి సంచలన వ్యాఖ్యలు

Boycott Bollywood | బాలీవుడ్ కొద్దిరోజులుగా గడ్డుపరిస్థితి ఎదుర్కోంటోంది. వాళ్ల సినిమాలు ఆడియన్స్‌కు అస్సలు నచ్చట్లేదు. ఏ సినిమా చేసినా ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ నడుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ కల్చర్ మరింత ఎక్కువైంది. స్టార్ హీరో, స్టార్ కిడ్ సినిమా ఏది వచ్చినా ఆ సినిమా బహిష్కరించాలని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మీ రొటీన్ ఫార్ములాలు మాకు అక్కర్లేదు.. కొత్త కథలు, కొత్త ఆర్టిస్టులు కావాలని పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు భారత దేశ సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్న బాలీవుడ్ పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడంపై ఒక్కొకరు ఒక్కో విశ్లేషణ చేస్తున్నారు. తాజాగా సునీల్ శెట్టి ( Sunil Shetty ) కూడా దీనిపై విశ్లేషించి.. తన యాంగిల్ చెప్పుకొచ్చాడు. కేవలం ఒక్క శాతం మంది వల్లనే బాయ్‌కాట్ బాలీవుడ్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుందని తెలిపాడు. వాళ్ల వల్లనే బాలీవుడ్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

భారత దేశ కల్చర్‌ను నలుమూలల విస్తరింపజేసేందుకు బాలీవుడ్ ఎంతగానో ప్రోత్సాహపడిందని సునీల్ శెట్టి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి ఇండస్ట్రీలో 32 ఏళ్లుగా కొనసాగుతున్నానని.. కాకపోతే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని వాపోయాడు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఫైనాన్స్, డేటా అనలిస్ట్‌లు స్క్రిప్ట్‌ను నిర్ణయించడం ఆపేయాలని సూచించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తీసుకురావాలని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. దీని నుంచి బయటపడాలంటే ప్రచారం ఎంతో ముఖ్యమని చెప్పాడు. ఒక సినిమా హిట్ అయితే మౌనంగా ఉండిపోకుండా దాని గురించి మనమే అందరికీ చెప్పుకొని పబ్లిసిటీ చేసుకోవాలని సూచించాడు. #BoycottBollywood అని హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేయడం దయచేసి ఆపేయాలని నెటిజన్లను విజ్ఞప్తి చేశాడు,

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News