Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentTunisha Sharma | మేకప్‌ రూంలో సూసైడ్‌ చేసుకున్న 20 ఏళ్ల నటి

Tunisha Sharma | మేకప్‌ రూంలో సూసైడ్‌ చేసుకున్న 20 ఏళ్ల నటి

Tunisha Sharma | ప్రముఖ హిందీ సీరియల్‌ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. సీరియల్‌ సెట్‌లోనే ఆమె ఉరివేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే తునీషా బలవన్మరణానికి పాల్పడటం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. తునీషా శర్మ మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలీబాబా – దస్తాన్ ఏ కాబూల్‌ సీరియల్‌తో తునీషా శర్మ గుర్తింపు తెచ్చుకుంది. తునీషా ముంబైలో శనివారం మధ్యాహ్నం సీరియల్‌ షూటింగ్‌ కోసం సెట్స్‌కు వెళ్లింది. ఈ క్రమంలో మేకప్‌ రూమ్‌కి వెళ్లిన తునీషా ఎంతసేపటికి తలుపు తీయలేదు. దీంతో ఆందోళన చెందిన సీరియల్‌ యూనిట్‌.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా తునీషా ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం కోసం తునీషా మృతదేహాన్ని తరలించారు.

చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు చివరి పోస్టు

తునీషా శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది క్షణాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్‌ చేసింది. అందులో మేకప్‌ వేసుకుని ఒక వైపు నిలబడి ఉన్నది. ఆ ఫొటోను షేర్‌ చేయడంతో పాటు.. ప్యాషన్‌తో ముందుకెళ్తున్న వారిని ఎవరూ ఆపలేరు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ ఫొటోను షేర్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే తునీషా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తునీషా.. పలు సీరియల్స్‌లో మెప్పించింది. భారత్‌ కా వీర్‌ పుత్ర – మహారాణా ప్రతాప్‌, చక్రవర్తి అశోక సామ్రాట్‌, గబ్బర్‌ పూంఛ్‌వాలా, షేర్‌ ఏ పంజాబ్‌ : మహారాజా రంజిత్‌ సింగ్‌, ఇంటర్నెట్‌ వాలా లవ్‌ , ఇష్క్‌ శుభాన్‌ అల్లా వంటి సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ తునీషా శర్మ బాలనటిగా అలరించింది. ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో, కహానీ 2, దబాంగ్‌ 3 సినిమాల్లో నటించింది. ఫితూర్‌, బార్‌ బార్‌ దేఖో సినిమాల్లో కత్రినా కైఫ్‌ చిన్ననాటి పాత్రలో తునీషా కనిపించింది. ఇక కహానీ2లో విద్యాబాలన్‌ కుమార్తెగా మెప్పించింది. ప్రస్తుతం అలీ బాబా : దస్తాన్‌ ఏ కాబూల్‌ సీరియల్‌లో షెహజాదీ మరియమ్‌ పాత్రలో నటిస్తుంది. ఈ క్యారెక్టర్‌తో హిందీ ప్రేక్షకుల అభిమాన నటిగా మారింది. కానీ ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు అందర్నీ కలిచివేస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Nikhil Siddhartha | హీరో అవుదామని 5 లక్షలు ఇచ్చి మోసపోయిన యంగ్ హీరో నిఖిల్

18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

Dhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News