Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentSushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసిన సారా అలీఖాన్‌.....

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసిన సారా అలీఖాన్‌.. ఎమోషనల్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి మూడేళ్లు దాటినా అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. నెపోటిజం కారణంగానే సుశాంత్‌ మరణించాడని బాలీవుడ్‌పై ఇప్పటికీ ఫ్యాన్స్‌ మండిపడుతూనే ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా #boycottbollywood అంటూ నిరసనగళం విప్పుతున్నారు. బాలీవుడ్‌లోని ఆధిపత్యం కారణంగా ఓ మంచి మనిషిని దూరం చేసుకున్నామని ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా బాధపడుతుంటారు. అప్పుడప్పుడు ఆయన్ను గుర్తుచేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే జనవరి 21న సుశాంత్‌ సింగ్‌ బర్త్‌ డేను బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ ( Sara ali khan ) సెలబ్రేట్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌, సారా అలీఖాన్‌ ఇద్దరూ కలిసి కేదార్‌నాథ్‌ సినిమాలో నటించారు. అప్పట్లో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమించుకున్నారా? లేదా అనే విషయాన్ని పక్కనపెడితే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌ అని మాత్రం చెప్పొచ్చు. ఈ స్నేహంతోనే జనవరి 21 సుశాంత్‌ బర్త్‌ డేను సారా అలీఖాన్‌ సెలబ్రేట్‌ చేసింది. ఓ ఎన్జీవోలోని చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి చప్పట్లు కొడుతూ ఎంజాయ్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్టు చేసింది.

Sushant singh rajput

హ్యాపీ బర్త్‌ డే సుశాంత్‌.. ఎదుటివాళ్లను నవ్వించడం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పైనుంచి మమ్మల్ని చూస్తున్నప్పుడు నీ మొహంలో చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నా. జై బోలేనాథ్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు సునీల్‌ అరోరా, బాల ఆశ ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపింది. పిల్లలతో కలిసి సుశాంత్‌సింగ్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో చూసి సుశాంత్ ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. సుశాంత్‌పై సారా అలీఖాన్‌ చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఫిదా అవుతున్నారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News