Home Entertainment Kiara Advani | ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా.. రాజరిక సంప్రదాయానికి ఏ...

Kiara Advani | ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా.. రాజరిక సంప్రదాయానికి ఏ మాత్రం తీసిపోలేదుగా..

Kiara Advani | ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ( Sidharth Malhotra ) ఒక్కటయ్యారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న సూర్యాగఢ్ ప్యాలెస్‌లో మంగళవారం కియారా, సిద్ధార్థ్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రాజరిక సంప్రదాయానికి ఏ మాత్రం తీసిపోకుండా వీరిద్దరి పెళ్లి జరిగింది.

రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం జరిగిన కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి కోసం సూర్యగఢ్ కోటను అందంగా ముస్తాబు చేశారు. సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాల కోసం భారీ డీజే ట్రక్కులు ఏర్పాటు చేశారు. పెళ్లి ఊరేగింపు కోసం పాపులర్ బ్యాండ్ తెప్పించారు. వీళ్లిద్దరినీ రథాలపై ఊరేగించినట్టు సమాచారం. కియారా, సిద్ధార్థ్ పెళ్లి కోసం 100 మంది వరకు అతిథులను ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, షాహిద్ కపూర్ తదితరులు హాజరయ్యారు. కాలా ఛష్మా, డోలా రే డోలా పాటలకు సంగీత్‌లో స్టెప్పులేశారు. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా వీరి పెళ్లి వేడుకకు హాజరైంది.

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో మునిగి తేలుతున్నారని చాలా రోజులుగా బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లిపై కూడా పలుమార్లు వదంతులు వినిపించాయి. కానీ వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు అటు సిద్ధార్థ్ మల్హోత్రా గానీ.. ఇటు కియారా అద్వానీ గానీ క్లారిటీ ఇవ్వలేదు. వీళ్లిద్దరి పెళ్లి డేట్ కన్ఫార్మ్ అయ్యిందని బీటౌన్‌లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమైన వీటిపై రియాక్ట్ కాలేదు. తమ పెళ్లి విషయాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Exit mobile version