Home Entertainment Shah Rukh Khan | తెలుగు థియేటర్లకు వస్తారా అంటే…షారూక్‌ ఇచ్చిన సమాధానం ఏంటంటే..!

Shah Rukh Khan | తెలుగు థియేటర్లకు వస్తారా అంటే…షారూక్‌ ఇచ్చిన సమాధానం ఏంటంటే..!

Shah Rukh Khan | బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విడుదలకు ముందే వివాదాస్పదంగా మారింది. ఇందులో దీపికా పడుకొణె వేసుకున్న బికినీతో మొదలైన రచ్చ.. బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ల దాకా వెళ్లింది. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కొంతమంది గొడవలు కూడా చేశారు. కానీ దేశభక్తి నేపథ్యంలోనే ఈ సినిమా వస్తుందని తెలిశాక చాలామంది సైలెంట్ అయ్యారు. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. వివాదాలు పెరగకుండా అందర్నీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు.

సోషల్ మీడియాలో #AskSRK పేరుతో అభిమానులతో ముచ్చటించాడు. పఠాన్ సినిమాకు అడ్వాన్స్‌డ్ బుకింగ్ చేసుకున్న ఆడియన్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సందర్భంగా షారుక్‌ను ఓ అభిమాని ఇంట్రెస్టింగ్ క్వొశ్చన్ అడిగాడు. పఠాన్ సినిమా విడుదలైన రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్‌కు ప్రమోషన్ కోసం వస్తారా? అని అడిగాు. దీనికి షారుక్ కూడా అంతే సరదాగా సమాధానమిచ్చాడు. రామ్‌చరణ్‌ తీసుకుని వెళ్తా అంటే తప్పకుండా వస్తానని బదులిచ్చాడు.

రామ్‌చరణ్‌కు షారుక్‌ఖాన్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మొన్నటికి మొన్న పఠాన్ సినిమా తెలుగు ట్రైలర్‌ను చెర్రీ రిలీజ్ చేశాడు. పఠాన్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. షారుక్ సర్ మిమ్మల్ని ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ పోస్టుకు షారుక్ కూడా థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఆస్కార్ సాధించి భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత అవార్డును టచ్ చేసే అవకాశం ఇస్తారా అని రిప్లై ఇచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

Exit mobile version