Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentAvatar 2 | ఇండియాలో అవతార్2 సరికొత్త రికార్డు.. అవెంజర్స్ ను దాటేసిన జేమ్స్ కామెరూన్...

Avatar 2 | ఇండియాలో అవతార్2 సరికొత్త రికార్డు.. అవెంజర్స్ ను దాటేసిన జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్

Avatar 2 | అవతార్-2 సినిమాకు ప్రపంచ సినీ ప్రేమికులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. గతేడాది డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. రిలీజ్ రోజున కొంత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రేక్షకులు పట్టం కట్టారు. నిజానికి ఈ సినిమా టాక్ చూసి బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అని అనుకున్నారు.. కానీ కళ్లు చెదిరే కలెక్షన్లు సాధిస్తూ ప్రపంచ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. సినిమా రిలీజై నెల దాటిన ఇంకా దీని జోరు కొనసాగుతూనే ఉంది. అవతార్-2 కలెక్షన్ల దాటికి పలు హాలీవుడ్ సినిమాల రికార్డులు చెల్లా చెదురవుతున్నాయి. ఇప్పటికే 2022 నెంబర్ వన్ గా ఉన్న ‘టాప్ గన్ మావరిక్’ను అవతార్ మూడు వారాల్లోనే దాటేసింది. ఇక మరో రెండు మూడు రోజుల్లో 2బిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకోనుంది.

ఇదిలా ఉంటే అవతార్ 2 సినిమా ఇండియాలోనూ ఒక ఊపు ఊపుతుంది. ఇప్పటికీ మల్టీప్లెక్స్ చైన్ లో దీని హవానే కొనసాగుతుండటం విశేషం. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా మంచి జోరు చూపిస్తుంది. తాజాగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా మన దేశంలో టాప్ వన్ గ్రాసర్ గా ఉన్న అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డును అవతార్-2 బ్రేక్ చేసింది. 2019లో వచ్చిన ఎండ్ గేమ్ ఇండియాలో రూ.367 కోట్లు సాధిస్తే.. అవతార్ 2 రూ.368 కోట్ల 20లక్షలు కలెక్ట్ చేసి ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక అఫిషియల్ గా తన పేరును నంబర్‌వన్ స్థానంలో లిఖించుకుంది. ఇదే జోరు కొనసాగితే అవతార్-2 రూ.400 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.

పైగా నార్త్ లో అజయ్ దేవగణ్ దృశ్యం 2 తప్పితే చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. మూడు రోజుల్లో పఠాన్ వస్తే దీని జోరు తగ్గుతుందేమో కానీ, ఫైనల్ రన్ మాత్రం మరో రెండు, మూడు వారాలు ఈజీగా లాక్కొస్తుంది. ఈ లోపు మరో రూ.32 కోట్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. పైగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో హౌజ్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఎంత లేదన్న మరో రెండు, మూడు వారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం రూ.10 కోట్లయిన అవతార్-2 పట్టుకొస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Kartik Aaryan | 10 రోజుల షూటింగ్ కోసమే రూ.20 కోట్లు తీసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో

aparna balamurali | కంప్లయింట్ ఇచ్చేంత టైమ్ లేదు.. విద్యార్థి అనుచిత ప్రవర్తనపై అపర్ణ బాలమురళి రియాక్షన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News