Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainment18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

18pages review | కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంట నటించిన చిత్రం 18 పేజిస్‌. గీతా ఆర్ట్స్‌ 2, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మించిన ఈ సినిమాను కుమార్‌ 21 ఎఫ్‌ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించాడు. సుకుమార్‌ కథ అందించిన ఈ సినిమాపై ఫస్ట్‌ నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న ఈ చిత్రం రిలీజైంది. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్న నిఖిల్‌.. 18 పేజిస్‌తో మరో హిట్‌ అందుకున్నాడా? ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో ఒకసారి చూద్దాం..

కథేంటి?

సిద్దూ అలియాస్‌ సిద్ధార్థ్‌ ( నిఖిల్‌ సిద్ధార్థ్‌ ) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ బాధతో తాగుతూ రోడ్లపై తిరుగుతున్న సమయంలో సిద్దూకి ఒక డైరీ దొరుకుతుంది. అది విజయనగరం జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరికి చెందిన నందిని ( అనుపమ పరమేశ్వరన్‌ ) అమ్మాయి 2019లో రాసుకున్న డైరీ. టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందిన ఈ టైమ్‌లో కూడా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వాడకుండా ప్రకృతికి దగ్గరగా జీవిస్తుంటుంది. ఆ డైరీలో రాసుకున్న వివరాలను చూసి నందిని వ్యక్తిత్వం నచ్చి ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆ డైరీ ఆధారంగా నందిని వెతుక్కుంటూ వెళ్తే హైదరాబాద్‌లో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తుంది.

పల్లెటూరి అమ్మాయి అయిన నందిని హైదరాబాద్‌కు ఎందుకు వచ్చింది? నందినిని చంపాలని అనుకుంది ఎవరు? నిజంగానే నందిని చనిపోయిందా? లేదా? నందిని గురించి వెతుక్కుంటూ వెళ్తే సిద్దూ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మిగతా కథ.

ఎలా ఉందంటే..

అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కానీ దీనికి కొన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను జోడించాడు సూర్యప్రతాప్‌. సుకుమార్‌ మనసులోని ఆలోచనలు రిప్రెజెంట్ చేసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు. సోషల్‌ మీడియాలో యువత గడిపేస్తున్న టైమ్‌లో అసలు సెల్‌ఫోన్‌ కూడా వాడని అమ్మాయి ఉండటం అనేది కొత్త ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఏదో నవలలో నాయికను చూసినట్టుగా కనిపిస్తుంది. తప్ప వాస్తవంగా అలాంటి వారు ఉండరనే చెప్పొచ్చు. డైరీ చదువుతూ సిద్దూ నందిని ప్రేమలో పడటం.. ఈ క్రమంలో సిద్దూ ఫ్రెండ్‌ బాగీ (సరయూ) మధ్య వచ్చే సన్నివేవాలు కాస్త ఫన్నీగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు సరయూ డైలాగ్స్‌ కాస్త ఓవర్‌గ అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. నందినికి ఏమైందనేది తెలుసుకోవడానికి సిద్దూ చేసే ప్రయత్నాలు ఉత్సుకతను కలిగిస్తాయి. కానీ సెకండాఫ్‌లో వచ్చే నందిని ఎపిసోడ్‌ కాస్త గందరగోళంగా ఉంటుంది. లాజిక్‌ అస్సలు కనిపించదు. సీన్స్‌ సాగదీసినట్టుగా బోరింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ ఎమోషన్‌గా సాగుతుంది.

ఎవరెలా చేశారంటే..

లవర్‌ బోయ్‌ పాత్రలు నిఖిల్‌కు కొట్టిన పిండే కాబట్టి సిద్దూ పాత్రలో లీనమైపోయాడు. అద్భుతంగా భావోద్వేగాలను పండించాడు. పల్లెటూరి నుంచి వచ్చిన అమాయకపు అమ్మాయి నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో తన టాలెంట్‌ చూపించేందుకు మంచి అవకాశం లభించింది. సిద్దూ ఫ్రెండ్‌ బాగీ పాత్రలో సరయూ ఫర్వాలేదనిపించింది. తెలంగాణ యాసలో ఆమె చేసిన కామెడీ అతిగా అనిపించినప్పటికీ నవ్వుతెప్పిస్తుంది. అజయ్ పోసాని కృష్ణ మురళి, శత్రు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సుకుమార్‌ రాసుకున్న కథకు దర్శకుడిగా పల్నాటి సూర్యప్రతాప్‌ న్యాయం చేశాడు. గోపీ సుందర్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సీన్స్‌ను హైలెట్‌ చేసింది. మరికొంచెం ఫోకస్‌ చేస్తే ఇంకా బాగుండేది. స్క్రీన్‌ ప్లే, ఎడిటింగ్‌ బాగున్నాయి.

బలాలు

+ కథ, స్క్రీన్‌ ప్లే, ట్విస్టులు
+ అనుపమ, నిఖిల్‌ జంట

బలహీనతలు

– సాగదీసే సన్నివేశాలు
– సెకండాఫ్‌

చివరగా.. 18 పేజిస్‌ ఒకసారి చదవచ్చు

Follow Us : FacebookTwitter

Read More Articles |

Laththi Review | లాఠీ సినిమా రివ్యూ.. ఈసారైన విశాల్ హిట్ కొట్టాడా?

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News