Home Entertainment VishnuPriya Bhimenini | నా లైఫ్‌లో మహారాణి మా అమ్మ మాత్రమే.. ఎమోషనల్‌ అయిన యాంకర్‌...

VishnuPriya Bhimenini | నా లైఫ్‌లో మహారాణి మా అమ్మ మాత్రమే.. ఎమోషనల్‌ అయిన యాంకర్‌ విష్ణుప్రియ

VishnuPriya Bhimenini | ఎప్పుడూ అల్లరి చేస్తూ కనిపించే యాంకర్‌ విష్ణుప్రియ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. కొద్దిరోజుల క్రితం మరణించిన తన తల్లిని తలచుకుంటూ కుంగిపోతోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ ఆన్‌లైన్‌లోకి రావడం కూడా మానేసింది. జనవరి 26న తన తల్లి మరణించిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేసిన విష్ణుప్రియ.. ఆ తర్వాత ఒక్క పోస్టు కూడా చేయలేదు. కానీ ఇన్నిరోజుల తర్వాత వాళ్ల అమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ ఓ పోస్టు చేసింది. చనిపోయిన తల్లిని తలచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది.

అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఎనర్జినీ ఎవరూ భర్తీ చేయలేరు. ఐ లవ్యూ అమ్మ. మిస్‌ యూ ఫరెవర్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా వాళ్ల అమ్మతో గడిపిన మధుర జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్‌ చేసింది. నా జీవితంలో ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని మాటలను ఆ వీడియో చివరలో జోడించింది.

యాంకర్‌ విష్ణుప్రియ, జబర్దస్త్‌ కమెడియన్‌ విష్ణుప్రియ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇటీవల బ్యాంకాక్‌ విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్‌ చేసొచ్చిన కొద్దిరోజుల్లో వీళ్లిద్దరూ తమ జీవితంలో ముఖ్యమైన వాళ్లను కోల్పోవడం ఇటీవల అందర్నీ కలిచివేసింది. ముందుగా రీతూ చౌదరి ఎంతగానో ప్రేమించే వాళ్ల నాన్నను కోల్పోయింది. ఆ తర్వాత వారం కూడా కాకముందే విష్ణుప్రియ భీమినేని వాళ్ల అమ్మ మరణించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Exit mobile version