Home Entertainment Goodachari2 | హ్యాట్రిక్‌పై గురి పెట్టిన అడవి శేష్.. గూఢచారి 2పై కీలక అప్‌డేట్

Goodachari2 | హ్యాట్రిక్‌పై గురి పెట్టిన అడవి శేష్.. గూఢచారి 2పై కీలక అప్‌డేట్

Image Source : Twitter

Goodachari2 | నాలుగేళ్ల క్రితం గూఢచారి సినిమాతో సంచలనం సృష్టించాడు అడవి శేష్. డీసెంట్ స్క్రీన్ ప్లేతో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడే సీక్వెల్ ఉంటుందని అడవి శేష్ ప్రకటించాడు. దీంతో గూఢచారికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అడవి శేష్ మాత్రం వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. మేజర్, హిట్ 2 వంటి చిత్రాలతో నటుడిగా దూసుకెళ్తున్నాడు. దీంతో గూఢచారి సీక్వెల్ ఇప్పుడు వస్తుందా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలోనే గూఢచారి 2 తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

2018లో వచ్చిన గూఢచారి సినిమాకు అడవి శేష్ కథ అందించాడు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన స్పై కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీసుకొచ్చారు. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ చాలా రోజులు దీనిపై అప్‌డేట్ లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు గూఢచారికి సీక్వెల్‌ను ప్రకటించారు. జీ2 పేరుతో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అడవి శేష్ ఎత్తయిన బిల్డింగ్‌ నుంచి జంప్ చేస్తూ గన్ కాలుస్తున్నట్టుగా ఉన్నాడు. ఇందులో ఫార్మల్ డ్రెస్‌లో అడవి శేష్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూశాక జీ2పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్ చూసి జీ2 భారీ విజయం సాధంచడం పక్కా అని అభిమానులు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

మేజర్ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి జీ2 సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే మేజర్, హిట్ 2 సినిమాతో సక్సెస్ అందుకున్న అడవి శేష్.. జీ2తో హ్యాట్రిక్ అందుకుంటాడో చూడాలి మరి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

Exit mobile version