Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentMamta Mohandas | మమతా మోహన్‌దాస్ అప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకుంది.. ఇప్పుడు మరో వ్యాధి...

Mamta Mohandas | మమతా మోహన్‌దాస్ అప్పుడు క్యాన్సర్ నుంచి కోలుకుంది.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడింది

Mamta Mohandas | నటి మమతా మోహన్ దాస్ మరోసారి వ్యాధి బారిన పడింది. ఇప్పటికే క్యాన్సర్‌తో పోరాడి కోలుకున్న మమత.. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

డియర్ సన్.. నీ కిరణాలను చూసేందుకు నీకంటే ముందే నిద్రలేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా నీతో గడపాలని అనుకుంటున్నా. నేను నా రంగును కోల్పోతున్నా. నీ మెరుపులో కొంత నాకిచ్చి దీని నుంచి బయటపడేలా చేయండి అంటూ మమతా మోహన్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ( Auto Immune Disease ), విటిలిగో ( vitiligo – బొల్లి ) అనే హ్యాష్‌ట్యాగ్స్ జోడించింది. అందులో సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ బయట కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో చర్మం నిగారింపు కోల్పోయినట్టుగా మమతా మోహన్ దాస్ కనిపించింది. మెడ ఎడమవైపు తెల్లగా మచ్చలు అయినట్టు కూడా ఏర్పడుతున్నాయి. మమతా మోహన్ దాస్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు చూసి అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారితోనే పోరాడి గెలిచిన యోధురాలివి.. ఇది చిన్న స్కిన్ ఎలర్జీ మాత్రమే.. దీనికి ట్రీట్‌మెంట్ కూడా ఉంది.. తొందరగానే తగ్గిపోతుందంటూ ధైర్యం చెబుతున్నారు.

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైంది మమతా మోహన్ దాస్. అంతకంటే ముందు సింగర్‌గా కూడా తెలుగులో తన గొంతును వినిపించింది. ఆకలేస్తే అన్నం పెడతా… రాఖీ రాఖీ.. వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులతో ఈలలు పెట్టించింది. ఆ తర్వాత నటిగా వెండితెర మీదకు వచ్చింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అదే సమయంలో 2010 లింఫోమా క్యాన్సర్ బారిన పడింది. ఆ మహమ్మారి నుంచి కోలుకుందని సంతోషించే సమయంలోనే మళ్లీ 2013లో తిరగబెట్టింది. ఆ సమయంలో మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారం జరిగింది. క్యాన్సర్‌తో పోరాడి మమతా మోహన్ దాస్ ఓడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. చివరగా ఆమె 2022లో వచ్చిన జనగణమణ చిత్రంలో ప్రొఫెసర్ సబా మరియం పాత్రలో నటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nitiin & Rashmika Mandanna | మరోసారి జోడీ కట్టబోతున్న నితిన్, రష్మిక.. భీష్మ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Shweta basu prasad | కొత్త బంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది?

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

Chiranjeevi | మాది సినిమా కులం.. సినీ కార్మికులను తలచుకుని మరోసారి ఎమోషనల్ అయిన చిరంజీవి

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News