Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentDhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌...

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Dhanya Balarkrishna & Kalpika Ganesh | నేను శైలజ, సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ వంటి సినిమాలతో పేరుతెచ్చుకున్న నటి ధన్య బాలకృష్ణ. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఓటీటీపై దృష్టిపెట్టిన ధన్య గురించి ఇప్పుడు ఒక విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే పెండ్లయి విడాకులు తీసుకున్న ఓ డైరెక్టర్‌తో ధన్య బాలకృష్ణ ప్రేమలో ఉందట. అతన్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం కూడా పెట్టిందట. కల్పిక గణేశ్‌ ఒక వీడియోలో ఈ విషయం చెప్పడంతో ధన్య బాలకృష్ణ పెళ్లి ఇప్పుడు వైరల్‌గా మారింది.

సమంతలాగే తనకూ మయోసైటిస్‌ ఉందని యశోద సినిమా ప్రమోషన్స్‌లో చెప్పి ఇటీవల సంచలనం సృష్టించింది కల్పిక గణేశ్‌. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ తనకు సర్జరీ జరిగిందని చెప్పింది. ఇలా కొద్దిరోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న కల్పిక.. తాజాగా ధన్య బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో ధన్య పెళ్లి చేసుకుందని కల్పిక తెలిపింది. అంతకుముందు కూడా చెన్నై వెళ్లినప్పుడు బాలాజీతోనే ఉండేదని చెప్పింది. బాలాజీ మోహన్‌కి ఇదివరకే పెళ్లయిందని.. మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చిందని చెప్పింది. తమిళంలో సినిమాలు చేసే సమయంలో బాలాజీతో ధన్యకు పరిచయం ఏర్పడిందని అది కాస్త ప్రేమగా మారిందని తెలిపింది. ఏడాది క్రితం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరూ చెన్నైలో కాపురం కూడా పెట్టారని సంచలన విషయం చెప్పింది.

ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయట పెట్టేందుకు ఇష్టపడట్లేదని పేర్కొంది. ఈ విషయం తెలిసినప్పుడు ధన్య గురించి చాలా భయపడ్డానని తెలిపింది. బాలాజీ ఆమెను టార్చర్‌ పెడతాడేమోనని అనుకున్నా.. కానీ వాళ్లిద్దరూ అన్యోన్యంగా కనిపించారని తెలిపింది. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌కి రాకపోవడంతో బాలాజీ ఆమెను ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడేమోనని అనుమానం వస్తుందని చెప్పింది. అందుకే ఈ విషయాన్ని బయటపెడుతున్నా అని పేర్కొంటూ వీడియో పెట్టింది. అయితే ఆ వీడియో కాపీ రైట్స్‌ కారణంగా డిలీట్‌ అయ్యింది. దీంతో తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కల్పిక ఓ పోస్టు పెట్టింది. డైరెక్టర్‌ బాలాజీనే తన వీడియో డిలీట్‌ చేయించారని అందులో పేర్కొంది. మరి కల్పిక వ్యాఖ్యలపై ధన్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News