Home Business Discontinued cars 2023 | ఇవాల్టి నుంచి ఈ కార్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.. కారణం ఇదే!

Discontinued cars 2023 | ఇవాల్టి నుంచి ఈ కార్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.. కారణం ఇదే!

Discontinued cars 2023 | ఇవాళ ఏప్రిల్‌ 1. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు. సో రోజూ వారీ లావాదేవీలు, అమ్మకాలు, ధరల విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వీటిలో భాగంగానే ఇవాల్టి నుంచి ఈ కార్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణం.

దేశంలో కర్బన ఉద్ఘారాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని కార్ల అమ్మకాలు నిలిపివేయాలని ఇప్పటికే తయారీ సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి. ఆయా సంస్థలు కూడా వాటి విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నిబంధనల ప్రకారం వాహనాలు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయాలి. ఇందుకోసమే ఆర్డీఈ నిబంధనలను రూపొందించింది.

ఆర్డీఈ అంటే..

కొత్తగా పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆర్‌డీఈ నిబంధనలు అంటే రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్స్‌. ఈ నిబంధనల ప్రకారం వాహనాల్లో కర్భన ఉద్గారాలకు సంబంధించిన రియల్‌ టైమ్‌ డేటాను ప్రదర్శించే సాంకేతికత వ్యవస్థలను పొందుపరచాలి. గతంలో విడుదల చేసిన వాహనాల్లో ఈ సాంకేతికత లేదు. వీటితోపాటు మార్కెట్లోకి వచ్చే ప్రతి వాహనం బీఎస్‌ 6 రెండో దశ ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి. ఈ నిబంధనలు లేని వాహనాలను ఆయా సంస్థలు ఇవాల్టి ( ఏప్రిల్‌ 1) నుంచి నిలిపివేయనున్నాయి.

అమ్మకాలు నిలిచిపోయే వాహనాలు ఇవే..

రెనాల్ట్‌ క్విడ్‌ 800 సీసీ, హోండా అమేజ్‌ డీజిల్‌ వెర్షన్‌, హోండా WR-V, హోండా సిటీ 4th జనరేషన్‌, హోండా జాజ్‌, హ్యుండాయ్‌ ఐ 20 డీజిల్‌, గ్రాండ్‌ ఐ 10 నియోస్‌, ఆరా, మారుతీ సుజుకీ ఆల్టో 800, ఇగ్నీస్‌, సియాజ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆల్టరస్‌ జీ4, నిస్సాన్‌, స్కోడా ఆక్టేవియా, నిస్సాన్‌ కిక్స్‌, ఇన్నోవా క్రిస్టా పెట్రోల్‌

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Heart Attack | జగిత్యాలలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన కౌన్సిలర్‌ భర్త.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మీయుల సమ్మేళనం రద్దు

Scam | పింఛన్‌ కోసం 15 ఏళ్లుగా అంధురాలిగా నటించిన మహిళ.. చివరకు గుట్టురట్టు

Weather Report | ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ..

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Exit mobile version