Home Business Viral News | పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి షాకిచ్చిన...

Viral News | పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి షాకిచ్చిన భారతీయ ఐటీ కంపెనీ!

Viral News | ఐటీ దిగ్గజ సంస్థలు అయినటువంటి గూగుల్‌, మెటా వంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఓ ఇండియన్‌ కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి వారిని ఆనందంలో ముంచెత్తింది.

అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే త్రిధ్య టెక్ సంస్థ తమ పనిచేస్తున్న 13 మందికి 13 ఖరీదైన కార్లను అందించింది. దీని గురించి ఆ సంస్థ ఎండీ రమేశ్‌ మారంద్ మాట్లాడుతూ… తమ కంపెనీ ఐదు సంవత్సరాలుగా సాధిస్తున్న విజయాల వెనుక.. కష్టపడి పనిచేసే తమ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారు కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధతకు మెచ్చి వారికి ఈ కార్లను ఇస్తున్నట్లు తెలిపారు.

ఇవే కాకుండా బాగా పనిచేసే ఉద్యోగులకు భవిష్యత్తులోనూ ఇలాంటి కానుకలు మరిన్ని అందుతాయని వివరించారు. ఉద్యోగులకు ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తే వారు మరింత బాగా పని చేసి, సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. తమను కంపెనీ యాజమాన్యం బాగా ప్రోత్సహిస్తోందని తమ కష్టాన్ని, శ్రమని మా విలువను సంస్థ బాగా గుర్తింస్తుందని ఉద్యోగులు చెప్పారు. గతంలోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇటువంటి ప్రోత్సాహకాలే ఇచ్చి ఉత్సాహపరిచాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Gautam Adani | గౌతమ్ అదానీని ఆదుకున్న ఆ ఇద్దరు రహాస్య స్నేహితులు ఎవరు.. ఏం చేశారు?

Gautam Adani | ఎఫ్‌పీఓ ఉపసంహరణపై గౌతమ్‌ అదానీ కీలక ప్రకటన.. షాక్‌లో పెట్టుబడి దారులు

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version